ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కలకలం.. భయపెడుతున్న కొత్త వేరియంట్..!

ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న టీకాలు ఫ్లిర్ట్ వేరియంట్లపై పోరాడగలవా? లేక కొత్త టీకాలు తీసుకోవాల్సి ఉంటుందా? అన్నదానిపై చర్చ సాగుతోంది.

Covid new variant FLiRT : కరోనా భూతం వదలనంటే వదలనంటోంది. భారత్ సహా అన్ని దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఇంకోసారి కోవిడ్ గురించి మాట్లాడుకుంటున్నాయి. సార్స్ కోవ్ 2 ఫ్లిర్ట్ వేరియంట్లుగా పిలుస్తున్న కరోనా కేసులు ఈ ఏడాది ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందిన డబ్ల్యూహెచ్ వో హెచ్చరించింది. ఈ వేరియంట్ వైరస్ స్పైక్ ప్రొటీన్ లో మ్యుటేషన్లు ఎక్కువగా ఉంటాయి. ఒమిక్రాన్, జేఎన్1 సబ్ వేరియంట్ల గ్రూప్ గా ఫ్లిర్ట్ వేరియంట్లను భావిస్తున్నారు.

వ్యాధి తీవ్రత గత వేరియంట్లతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ.. తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఇప్పటికే టీకాలు వేయించుకున్న వారిలో వేరియంట్ల ప్రభావం ఎంత ఉందన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న టీకాలు ఫ్లిర్ట్ వేరియంట్లపై పోరాడగలవా? లేక కొత్త టీకాలు తీసుకోవాల్సి ఉంటుందా? అన్నదానిపై చర్చ సాగుతోంది.

Also Read : కరోనా దుష్ప్రభావాలు.. మనుషుల ఆయుర్దాయం ఎంత తగ్గుతుందో తెలుసా?

పూర్తి వివరాలు..

ట్రెండింగ్ వార్తలు