కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?: బండి సంజయ్

Bandi Sanjay: రాజ్యాంగ మౌలిక సూత్రాలని కేసీఆర్ ఉల్లంఘించారని అన్నారు.

Bandi Sanjay

గతంలో ఫోన్ ట్యాపింగ్ చేయిస్తూ ప్రతిపక్షాలపై మాజీ సీఎం కేసీఆర్ సైబర్ దాడి చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. ఎమర్జెన్సీకంటే దారుణమైన కేసు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమని చెప్పారు.

రాజ్యాంగ మౌలిక సూత్రాలని కేసీఆర్ ఉల్లంఘించారని అన్నారు. రాధాకిషన్ రావు వాంగ్మూలమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఎమ్మెల్యే సహా కేసీఆర్ ఏ పదవి చేపట్టడానికీ అర్హుడు కాదని చెప్పారు. కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు.

కేసీఆర్‌ను సర్కారు కాపాడటం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్, కేటీఆర్‌ను అరెస్ట్ చేసి విచారణ జరిపించాలని ఆయన అన్నారు. సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. తీగలాగిన కొద్దీ అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఆమ్ ఆద్మీ పార్టీకి స్వాతి మలీవాల్ రాజీనామా చేస్తున్నారా? ఆమె ఏం చెప్పారో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు