ఆమ్ ఆద్మీ పార్టీకి స్వాతి మలీవాల్ రాజీనామా చేస్తున్నారా? ఆమె ఏం చెప్పారో తెలుసా?

Swati Maliwal: తనపై దాడి జరిగిన తర్వాత పార్టీ మారాలని బీజేపీ తననేం సంప్రదించలేదని అన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీకి స్వాతి మలీవాల్ రాజీనామా చేస్తున్నారా? ఆమె ఏం చెప్పారో తెలుసా?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని ఆరోపించిన రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్ ఆ పార్టీని వీడతారా? అన్న ప్రశ్నకు సమాధానం దొరికింది. ఎంపీ స్వాతి మలివాల్ తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. దీనిపై స్పందించారు.

ఆప్ ఇద్దరు-ముగ్గురికి చెందినది కాదని, కాబట్టి పార్టీని వీడేది లేదని స్వాతి స్పష్టం చేశారు. తనపై దాడి జరిగిన తర్వాత పార్టీ మారాలని బీజేపీ తననేం సంప్రదించలేదని అన్నారు. తనపై జరిగిన దాడి గురించి తాను నిజాలు మాట్లాడకపోతే తనకు, తన పార్టీకి మధ్య సత్సంబంధాలు సరిగ్గా ఉండకపోయేవన్నారు.

తనను తీవ్రంగా కొట్టినప్పటికీ దేశంలో ఎన్నికలు జరుగుతున్నందున తాను సంయమనం పాటించానన్నారు. అలా చేయకపోతే ఈ సమస్య రాజకీయం అవుతుందని తనకు తెలుసని స్వాతి చెప్పారు. తాను దీన్ని అర్థంచేసుకున్నానని తెలిపారు.

తనను తాను నియంత్రించుకోవడానికి ప్రయత్నించానని తెలిపారు. కాగా, తాను 2006లో ఇంజనీర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశానని, అరవింద్ కేజ్రీవాల్‌ వద్ద పూర్తి స్థాయి వాలంటీర్‌గా పనిచేశానని చెప్పారు. తాను అన్నా హజారే ఉద్యమంలో కోర్ కమిటీ సభ్యురాలిగా ఉన్నానని తెలిపారు.

Also Read: తెలంగాణ డీజీపీ కార్యాలయానికి వెళ్లి హత్యపై ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్