Reliance Jio Ghana : ఆఫ్రికా టెలికం మార్కెట్లోకి రిలయన్స్ జియో ఎంట్రీ? ఘనా ఎన్‌జీఐసీతో డీల్..!

Reliance Jio Ghana : ఈ ఏడాది చివరి నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తున్న ఎన్‌జీఐసీ ఘనాలోని మొబైల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లకు 5జీ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను అందించనుంది.

Reliance Jio Ghana : భారతీయ టెలికాం మార్కెట్‌లో అగ్రగామి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి చెందిన రిలయన్స్ జియో ఆఫ్రికా మార్కెట్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఘనాకు చెందిన నెక్ట్స్‌-జెన్‌ ఇన్‌ఫ్రాకోతో (NGIC)తో జియో చేతులు కలపనుంది. జియో ప్రస్తుతం 470 మిలియన్ల వినియోగదారులతో భారత అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా అవతరించింది. ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ దేశీయ మార్కెట్లో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్‌ల కోసం టెలికం వెంచర్‌తో ఆఫ్రికాలోకి ప్రవేశించబోతున్నారు.

ఈ నేపథ్యంలోనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యూనిట్ అయిన ర్యాడిసిస్‌ కార్ప్‌తో ఎన్‌జీఐసీ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఘనా ఆధారిత నెక్స్ట్ జెన్ ఇన్‌ఫ్రాకో కోసం కీలకమైన 5జీ నెట్‌వర్క్ అమలుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, అప్లికేషన్లు, స్మార్ట్‌ఫోన్లను ర్యాడిసిన్ అందించినట్టు ఎన్‌జీఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హర్కిదత్ సింగ్ వెల్లడించినట్టు బ్లూమ్‌బెర్గ్ ప్రకటించింది.

Read Also : Realme Narzo N65 5G : అదిరే ఫీచర్లతో రియల్‌మి నార్జో N65 ఫోన్ వచ్చేసింది.. ఈ 5జీ ఫోన్ ధర ఎంతో తెలుసా?

ఘనాలో 5జీ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు : 
భారత ఆర్థిక కేంద్రమైన ముంబైలో సోమవారం (మే 27) ఎన్‌జీఐసీ ప్రారంభ ప్రకటనకు ముందు ప్రణాళికలను ఆయన వివరించారు. ఈ ఏడాది చివరి నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తున్న ఎన్‌జీఐసీ ఘనాలోని మొబైల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లకు 5జీ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను అందించనుంది.

కంపెనీ “అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో సరసమైన డిజిటల్ సర్వీసులను నిర్మించే ఆవరణపై ఆధారపడిందని సింగ్ బ్లూమ్‌బెర్గ్ న్యూస్‌తో అన్నారు. ఎన్‌జీఐసీలోని ఇతర వ్యూహాత్మక భాగస్వాములలో నోకియా, Oyj, ఇండియన్ అవుట్‌సోర్సర్ టెక్ మహీంద్రా లిమిటెడ్, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఉన్నాయి. 2020లో రెండు క్లౌడ్ నెట్‌వర్కింగ్ సంస్థలను కొనుగోలు చేసిన తర్వాత టెలికాం వ్యాపారంపై మరింతగా తన దృష్టి సారించింది.

ఘనాలో మూడు ప్రధాన ఆపరేటర్లు :
కేవలం 33 మిలియన్ల జనాభా కలిగిన పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఘనాలో మూడు ప్రధాన ఆపరేటర్‌లను కలిగి ఉంది. అందులో ఎంటీఎన్, ఘనా, వోడాఫోన్ ఘనా, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎయిర్‌టెల్‌టిగో (AirtelTigo), ఎన్‌జీఐసీ వ్యూహాత్మక భాగస్వాములుగా పేర్కొంది. సాంకేతిక నైపుణ్యంతో పాటు ఘనా ఏకైక 5జీ లైసెన్స్‌ను కంపెనీ కలిగి ఉండటం బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులకు సాయపడుతుందని, వ్యక్తిగత మొబైల్ క్యారియర్‌లకు భారీ వ్యయం అవుతుందని సింగ్ చెప్పారు.

రెండు ఆఫ్రికన్ టెలికాం సంస్థల్లో (Ascend Digital Solutions Ltd), K-NET కొత్త కంపెనీలో 55శాతం వాటాను కలిగి ఉన్నాయని సింగ్ చెప్పారు. ఘనా ప్రభుత్వం ఎన్‌జీఐసీలో కేవలం 10శాతం లోపు మాత్రమే కలిగి ఉంటుంది. అయితే, స్థానిక మొబైల్ ఆపరేటర్లు, ప్రైవేట్ పెట్టుబడిదారులు సంస్థలో మిగిలిన షేర్లను సింగ్ అసెండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కూడా ఉన్నారు. ఎన్‌జీఐసీ ఒక దశాబ్దం పాటు ఘనాలో 5జీ సేవలను అందించే ప్రత్యేక హక్కును కలిగి ఉంది. అయితే, దీని లైసెన్స్ 15 ఏళ్ల పాటు చెల్లుతుంది. మూడేళ్లపాటు కంపెనీ మూలధన వ్యయం 145 మిలియన్ డాలర్లు అని సింగ్ తెలిపారు.

2024 ఏడాది ఆఖరిలోగా ఘనాలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఎన్‌జీఐసీ సన్నాహాలు చేస్తోంది. సర్వీసుల ధరపై వ్యూహాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. దేశ సమాచార శాఖ మంత్రి మాత్రం ఎన్‌జీఐసీ టెలికాం సర్వీసులను అందిస్తుందని ప్రకటించారు. తక్కువ ధరలతో భారత్‌ మొబైల్‌ డేటా విప్లవాన్ని అనుసరిస్తామని పేర్కొన్నారు. ఆ దేశంలో వచ్చే 10ఏళ్ల పాటు 5జీ సర్వీసులను అందించాలని ఎన్‌జీఐసీ పర్మిషన్ పొందింది. దాంతో ఎంటీఎన్‌ ఘనా, వొడాఫోన్‌ ఘనా, ఎయిర్‌టెల్‌టిగోతో పోటీ పడనుంది.

Read Also : Samsung Galaxy F55 5G Launch : వేగన్ లెదర్ ఫినిష్‌తో శాంసంగ్ గెలాక్సీ F55 5జీ ఫోన్, ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు