అందుకే నా కారుపై దాడి చేశారు: వైసీపీ అభ్యర్థి కారుమూరి

అక్కడ ఎదురు తిరిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అక్కడినుండి వచ్చేశానంటున్నారు.

ఏలూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ కారుపై దాడి జరిగింది. గతరాత్రి జంగారెడ్డి గూడెం టౌన్ ఎన్నికల ప్రచార కార్యక్రమం ముగించుకుని నూజివీడు నియోజకవర్గం ముసునూరు వెళుతున్న క్రమంలో రంగాపురం గ్రామం వద్ద ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు.

ఓడిపోతున్నామన్న భయంతోనే తమపై దాడులకు పాల్పడుతున్నారని సునీల్ కుమార్ అన్నారు. ఇవాళ 10టీవీతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి కమ్మ ఆత్మీయ సమావేశానికి వచ్చిన టీడీపీ, జనసేన శ్రేణులు తనపై దాడి చేశారని తెలిపారు.

అక్కడ ఎదురు తిరిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అక్కడినుండి వచ్చేశానంటున్నారు. అధికారంలో లేకపోతేనే ఇంతటి అరాచకానికి తెగబడుతున్న టీడీపీ అధికారంలోకి వస్తే మరింత రెచ్చిపోతుందని చెప్పారు. టీడీపీ చర్యలను ఆయన ఖండిస్తున్నానన్నారు. తమ సహనాన్ని పరీక్షించ వద్దని హెచ్చరిస్తున్నారు.

ల్యాండ్ టైటలింగ్ చట్టానికి, వారి భూమి వివాదానికి సంబంధం ఏంటి?: పేర్ని నాని

ట్రెండింగ్ వార్తలు