ల్యాండ్ టైటలింగ్ చట్టానికి, వారి భూమి వివాదానికి సంబంధం ఏంటి?: పేర్ని నాని

అక్కడ రైతులకు, పీవీ రమేశ్ కి గొడవలు ఉంటే వైసీపీ సర్కారుపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని..

ల్యాండ్ టైటలింగ్ చట్టానికి, వారి భూమి వివాదానికి సంబంధం ఏంటి?: పేర్ని నాని

Perni Nani

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పే దమ్ము ఆయనకు లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ… కొందరు మాజీ అధికారులను ప్రభుత్వంపై విషం చిమ్మేలా ఉసిగొల్పుతున్నారని చెప్పారు.

పీవీ రమేశ్ తండ్రి సుబ్బారావు మాస్టర్ కొందరు రైతులతో కలిసి ఉమ్మడిగా భూమిని లీజుకు ఇచ్చారని తెలిపారు. 70 ఎకరాల పొలాన్ని 20 ఏళ్ల క్రితమే చెరువు తవ్వి అందరితో కలిసి లీజుకు ఇస్తున్నారని చెప్పారు. సరిహద్దులు లేని పీవీ రమేశ్ పొలం ఇప్పటికే వివాదంలో ఉందని తెలిపారు.

ల్యాండ్ టైటలింగ్ చట్టానికి, వారి భూమి వివాదానికి సంబంధం ఏంటని నిలదీశారు. వినగడపలో జనవరిలో భూ వివాదంపై విచారణ జరిపారని అన్నారు. భూముల అసలు పత్రాలు తీసుకురావాలని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు పీవీ రమేశ్ రాలేదని చెప్పారు.

అక్కడ రైతులకు, పీవీ రమేశ్ కి గొడవలు ఉంటే వైసీపీ సర్కారుపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ల్యాండ్ టైటలింగ్ చట్టానికి, వారి భూమి వివాదానికి సంబంధం ఏంటని నిలదీశారు. చంద్రబాబుకు సానుకూలంగా ట్వీట్లు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

MLC Kavitha : నో బెయిల్.. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురు