Pawan Kalyan: హరీష్ శంకర్ సూపర్ సక్సెస్.. ఫిదా అయిన పవన్ కళ్యాణ్.. మిగతా దర్శకులకు వార్నింగ్ లాంటిదే!
హరీష్ శంకర్ ను పొగుడుతూ తన నెక్స్ట్ సినిమా డైరెక్టర్స్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్(Pawan Kalyan).
Pawan Kalyan Mesmerized by director Harish Shankar Work
- హరీష్ జెట్ స్పీడ్ టేకింగ్ కి పవన్ ఫిదా
- తరువాతి దర్శకులకు ఇది పెద్ద టార్గెట్ లాంటిదే
- సురేందర్ రెడ్డి ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించారు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత పవన్- హరీష్ కాంబోలో వస్తున్న ఈ సినిమా మార్చి 19న భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. ఈ నేపధ్యంలోనే తాజాగా హైదరాబాద్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.
ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హరీష్ శంకర్ ప్లానింగ్ కి ఫిదా అయ్యా అంటూ చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తన పొలిటికల్ బిజీ షెడ్యూల్ మధ్యలో కూడా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని కేవలం 45 రోజుల్లోనే పూర్తి చేశాడట. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పవన్ స్వయంగా దర్శకుడు హరీష్ శంకర్ ప్లానింగ్‌ను ప్రశంసించడం విశేషం. అతి తక్కువ సమయంలో, ఎక్కడ క్వాలిటీ తగ్గకుండా షూటింగ్ పూర్తి చేయవచ్చనే నమ్మకాన్ని హరీష్ తనలో నింపాడని, అందుకే ఇకపై మరిన్ని సినిమాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని పవన్ ప్రకటించారు.
Malavika Mohanan: ఆరంజ్ కలర్ డ్రెస్సులో ఓ రేంజ్ గ్లామర్.. మాళవిక అందానికి నెటిజన్స్ ఫిదా.. ఫొటోలు
ఇది పవన్‌తో సినిమా చేయాలనుకునే తదుపరి దర్శకులకు ఒక స్వీట్ వార్నింగ్ అనే చెప్పాలి. హరీష్ శంకర్ సెట్ చేసిన ఈ స్పీడ్ ఇప్పుడు సురేందర్ రెడ్డి, సుజిత్ లాంటి దర్శకులకు పెద్ద సవాల్ అనే చెప్పాలి. ముఖ్యంగా భారీ అంచనాలు ఉన్న ‘OG’ సినిమాకు సంబంధించి ప్రీక్వెల్, సీక్వెల్ ప్లాన్స్ కూడా ఉండటంతో, సుజిత్ ఈ టైమ్ మేనేజ్మెంట్ను ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
అలాగే సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కాల్సి ఉంది. హరీష్ శంకర్ చూపించిన ఈ వేగం వల్ల, పవన్ డేట్స్ కోసం వేచి చూస్తున్న మిగిలిన దర్శకులు కూడా తమ స్క్రిప్టులను, షూటింగ్ షెడ్యూల్స్‌ను పక్కాగా ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలంటే, హరీష్ శంకర్ లాగే షార్ట్ టైమ్‌లో అవుట్‌పుట్ ఇచ్చే ప్లాన్ సిద్ధంగా ఉండాలని ఇండస్ట్రీ టాక్. మరి పవన్ కళ్యాణ్ మాటలను ఆయన తరువాతి సినిమా దర్శకులు ఎలా తీసుకుంటారో చూడాలి.
