Rahul Gandhi : ఆ రాష్ట్రాల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవటం ఖాయం,కాంగ్రెస్ గెలుపు పక్కా : రాహుల్ గాంధీ

పేదల పక్షాలన ఉన్నాం..కాబట్టి మనదే విజయం.ఇద్దరు ముగ్గురు కోసం బీజేపీ పనిచేస్తోంది. బీహార్ ను గెలిస్తే దేశాన్ని గెలుస్తాం.

Rahul Gandhi : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం..తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీజ్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది అంటూ రాహుల్ గాంధీ ధీమా వ్యక్తంచేశారు. బీజేపీని అంతం చేసేందుకు విపక్షాలన్నీ కలుస్తున్నాయి. ఒక్కతాటిమీదికొస్తున్నాయి. దీంట్లో భాగంగా పలువురు విపక్ష పార్టీల నేతలు, పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీల ప్రతినిధులు బీహార్ రాజధాని పాట్నా చేరుకున్నారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆర్గనైజేషన్ ఇన్‌ఛార్జ్ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్‌తో కలిసి పాట్నా చేసుకున్నారు. వీరికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాహుల్ గాంధీ ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయానికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఈ విపక్ష సమావేశానికి ముందు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతు..వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం..తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీజ్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందంటూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. పేదల పక్షాలన ఉన్నాం..కాబట్టి మనదే విజయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. ఇద్దరు ముగ్గురు కోసం బీజేపీ పనిచేస్తోందని కానీ మనం మాత్రం పేదల కోసం పనిచేస్తున్నానమని కాబట్టి విజయం మనదేనన్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతు..బీహార్ ను గెలిస్తే దేశాన్ని గెలుస్తాం అని అన్నారు.

Opposition Meet: దేవదాస్ సినిమా డైలాగ్ రీమేక్ చేసి రాహుల్ గాంధీపై అదిరిపోయే సెటైర్ వేసిన బీజేపీ

కాగా 2024 లోక్‌సభ ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై విపక్ష నేతల సమావేశంలో ప్రధానంగా చర్చజరుగునున్నట్లుగా సమాచారం. బీహార సీఎం నితీశ్ కుమార్ ఈ సమావేశానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ సమావేశానికి దేశ వ్యాప్తంగా పలువురు అగ్రనేతలు హాజరవుతున్నారు. కాంగ్రెస్, బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్, అలాగే ఢిల్లీ, పంజాబ్ లలో అధికారంలో ఉణ్న ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన (ఉద్ధవ్ థాకరే), డీఎంకే, జేఎంఎం, సమాజ్‌వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఐ, సీపీఎం, జేడీయూ, ఆర్జేడీ పార్టీలు సమావేశానికి హాజరవుతున్నాయి.

కాగా ఈ విపక్షాల సమావేశానికి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, బీఎస్సీ అధినేత మాయావతి, తెలంగాణ సీఎం కేసీఆర్ గౌర్హాజరు కావటం గమనించాల్సిన విషయం. నవీన్ పట్నాయక్, కేసీఆర్ ఈ సమావేశానికి మిస్ చేయాలని నిర్ణయించుకున్నప్పటీకి మాయావతికి అసలు ఆహ్వానించలేదని తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్న పార్టీలను ఆహ్వానించామని జేడీ(యూ) అధికార ప్రతినిధి కేసీ త్యాగి తెలిపారు.

Opposition Meet: పాట్నాకు చేరుకున్న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఇతర నేతలు



										

ట్రెండింగ్ వార్తలు