Hathras stampede : తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా.. హత్రాస్ ఘటనపై ఏమన్నారంటే?

హత్రాస్ ఘటన మిగిల్చిన విషాదాన్ని భరించే శక్తి దేవుడు మాకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఘటన తరువాత నేను ఎంతో వేదనకు

Bhole Baba

Hathras Tragedy : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాత్రాస్ జిల్లా ఫుల్‌ర‌యీ గ్రామంలో జూలై 2న పెనువిషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. స‌త్సంగ్ కార్య‌క్ర‌మంలో భోలే బాబా పాద దూళి కోసం భక్తులు ఒక్కసారిగా ఎగడబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 121 మంది మృతిచెందగా.. అనేక‌ మందికి గాయాలయ్యాయి. మృతుల్లో అధికంగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈ ఘటన తరువాత భోలేబాబా పరారీలో ఉన్నాడు. తాజాగా ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. హత్రాస్ ఘటన గురించి మౌనం వీడాడు. ఈ దుర్ఘటనపై విచారణ వ్యక్తం చేశారు.

Also Read : NEET-UG 2024 : నీట్ యూజీ పరీక్ష రద్దు, అక్రమాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ..

హత్రాస్ ఘటన మిగిల్చిన విషాదాన్ని భరించే శక్తి దేవుడు మాకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఈ ఘటన తరువాత నేను ఎంతో వేదనకు గురయ్యాను. తొక్కిసలాటకు కారణమైన వారు ఎట్టిపరిస్థితుల్లో తప్పించుకోలేరని నేను నమ్ముతున్నాను. నాకు ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం ఉంది. బాధ్యులైన వారు తప్పనిసరిగా తగిన శిక్ష అనుభవిస్తారని భోలే బాబా అన్నారు. మరణించిన కుటుంబాలు, గాయపడిన వారికి జీవితాంతం అండగా నిలబడాలని, వారికి సాయం చేయాలని నా న్యాయవాది ఏపీ సింగ్ ద్వారా కమిటీ సభ్యులను అభ్యర్థించానని మీడియా ముందు ఆయన పేర్కొన్నారు.

Also Read : సికింద్రాబాద్ శ్రీజగన్నాథ రథయాత్ర తేదీ, సమయం.. పూర్తి వివరాలు

ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసింది.. 100మందికిపైగా వాగ్మూలాలను నమోదు చేసింది. ఇప్పటికే ఆరుగురు వాలంటీర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా.. ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాశ్ మధుకర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హత్రాస్ సత్సంగ్ కార్యక్రమానికి దేశ్ ప్రకాశ్ నిర్వాహకుడిగా ఉన్నాడు. తొక్కిసలాట ఘటన అనంతరం పరారీలో ఉన్న అతను.. ఢిల్లీలో యూపీ ఎస్టీఎఫ్ అధికారుల ఎదుట లొంగిపోవటంతో.. అతన్ని వారు యూపీ పోలీసులకు అప్పగించారు.