NEET-UG 2024 : నీట్ యూజీ పరీక్ష రద్దు, అక్రమాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ..

నీట్ యూజీ పరీక్ష రద్దు, అక్రమాలపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

NEET-UG 2024 : నీట్ యూజీ పరీక్ష రద్దు, అక్రమాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ..

Supreme Court

Updated On : July 6, 2024 / 10:58 AM IST

NTA Affidavit to Supreme Court : నీట్ యూజీ పరీక్ష రద్దు, అక్రమాలపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. 26 పిటీషన్లను కలిపి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్ర చూడ్, జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం విచారణ చేయనుంది. నీట్ యూజీ పరీక్ష రద్దు చేయాలని, తిరిగి పరీక్ష నిర్వహించాలని విద్యార్థులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నీట్ రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ యూజీ పరీక్ష రద్దు చేయడం వల్ల నిజాయితీ కలిగిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని సుప్రీంకోర్టుకు కేంద్రం, ఎన్టీయే తెలిపింది.

Also Read : Mount Etna Volcano : ఇటలీలో బూడిదమయమైన విమానాశ్రయం.. నిలిచిపోయిన విమాన రాకపోకలు

నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేనప్పుడు పరీక్ష రద్దు చేయడం హేతుబద్ధం కాదని కేంద్రం, ఎన్టీయే కోర్టుకు తెలిపింది. నీట్ పరీక్ష రద్దు నిజాయితీగా పరీక్ష రాసిన అభ్యర్థులకు నష్టం చేకూరుస్తుందని, నిజాయితీగా పరీక్ష రాసిన విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటానికి కట్టుబడి ఉన్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అక్రమాలకు ఆధారాలు ఉన్న సందర్భంలో అభ్యర్థుల ఆందోళన పరిగణలోకి తీసుకోవాలికానీ.. ఊహాగానాల ఆధారంగా పరీక్ష రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. పరీక్షల మోసాలకు సంబంధించి సీబీఐ దర్యాప్తు జరుపుతుందని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. నీట్ పరీక్ష నిర్వహణలో పారదర్శకతకు సంబంధించి చేపట్టాల్సిన చర్యల కోసం అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు సుప్రీంకోర్టు దృష్టికి కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లింది.

Also Read : ప్రధానిగా చివరి ప్రసంగంలో భావోద్వేగానికి గురైన రిషి సునాక్.. కీర్ స్టార్మర్ గురించి కీలక వ్యాఖ్యలు

నీట్ పరీక్ష పారదర్శకంగా నిర్వహించామని అక్రమాలు చోటు చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని సుప్రీంకోర్టుకు ఎన్టీఏ తెలిపింది. నీట్ పరీక్షలో అక్రమాలు, మోసం, పేపర్ లీకేజ్ ఆరోపణలు పాట్నా, గోద్రా లోని కొన్ని పరీక్ష కేంద్రాల పరిధిలో మాత్రమే ఉందని, నీట్ పరీక్ష రద్దు చేస్తే అభ్యర్థుల భవితవ్యం, అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని సుప్రీంకోర్టుకు దృష్టికి ఎన్టీయే తీసుకెళ్లింది.