ప్రధానిగా చివరి ప్రసంగంలో భావోద్వేగానికి గురైన రిషి సునాక్.. కీర్ స్టార్మర్ గురించి కీలక వ్యాఖ్యలు

ప్రధానిగా నా బాధ్యతలను ఏ లోటు లేకుండా నిర్వర్తించానని భావిస్తున్నా. కానీ, యూకేలో ప్రభుత్వం కచ్చితంగా మార్చాల్సిందేనని ప్రజలు ..

ప్రధానిగా చివరి ప్రసంగంలో భావోద్వేగానికి గురైన రిషి సునాక్.. కీర్ స్టార్మర్ గురించి కీలక వ్యాఖ్యలు

Rishi Sunak

Rishi Sunak Emotional Speech : బ్రిటన్ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్ నేతృత్వం వహించిన కన్జర్వేటివ్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. 14ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు ఎండ్ కార్డు పడింది. లేబర్ పార్టీ అద్భుత విజయంతో అధికారంలోకి వచ్చింది. నూతన ప్రధానిగా లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ బాధ్యతలు చేపట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 412 స్థానాల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. అధికార కన్జర్వేటివ్ పార్టీ 121 సీట్లకే పరిమితం అయింది. ఓటమి తరువాత అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ ముందు నిలబడి ప్రధానిగా రుషి సునాక్ తన చివరి ప్రసంగం చేశారు. సతీమణి అక్షతామూర్తిని పక్కనే ఉండగా.. ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

Also Read : కొంపముంచిన హామీలు, అనాలోచిత నిర్ణయాలు.. బ్రిటన్ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్ ఘోర ఓటమి

ప్రధానిగా నా బాధ్యతలను ఏ లోటు లేకుండా నిర్వర్తించానని భావిస్తున్నా. కానీ, యూకేలో ప్రభుత్వం కచ్చితంగా మార్చాల్సిందేనని ప్రజలు స్పష్టమైన సందేశమిచ్చారు. మీ తీర్పే అంతిమం. మీ ఆగ్రహాన్ని, అసంతృప్తిని నేను విన్నాను. ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే అంటూ భార్య అక్షతామూర్తిని చూసుకుంటూ సునాక్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఎన్నో గడ్డు పరిస్థితుల తర్వాత ఇది చాలా కష్టమైన రోజు. ఈ దేశ ప్రధానిగా సేవ చేసే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నానని అన్నారు. లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ మంచి వ్యక్తి అని సునాక్ అన్నారు. అనంతరం సతీమణి అక్షతామూర్తితో కలిసి బకింగ్ హోమ్ ప్యాలెస్ కు వెళ్లారు.

Also Read : బ్రిటన్ కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్.. భారత్, బ్రిటన్ మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి..!