సికింద్రాబాద్ శ్రీజగన్నాథ రథయాత్ర తేదీ, సమయం.. పూర్తి వివరాలు

సికింద్రాబాద్‌ జనరల్ బజార్‌లోని జగన్నాథ దేవాలయం ట్రస్ట్ గత 130 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా ప్రతిష్టాత్మకంగా ఈ రథయాత్రను నిర్వహిస్తోంది.

సికింద్రాబాద్ శ్రీజగన్నాథ రథయాత్ర తేదీ, సమయం.. పూర్తి వివరాలు

Secunderabad Shree Jagannath Rath Yatra 2024 date and time full details

Jagannath Rath Yatra 2024: ప్రతి సంవత్సరం శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పూరిలో జరిగే జగన్నాథ రథయాత్రతో పాటుగా నగరంలో జగన్నాథ భగవానుడు, బలభద్రుడు మరియు సుభద్ర దేవతల రథయాత్రను నిర్వహిస్తోంది. సికింద్రాబాద్‌ జనరల్ బజార్‌లోని జగన్నాథ దేవాలయం ట్రస్ట్ నిర్వహణలో గత 130 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ప్రతిష్టాత్మకంగా ఈ రథయాత్ర కొనసాగుతోంది. ఆదివారం (జూలై 7) ఈ యాత్ర నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా ఆలయ ద్వారాలు ఉదయం 6:00 గంటల నుంచి భక్తుల దర్శనం కోసం తెరవబడతాయి. మధ్యాహ్నం 1:00 గంటలకు మూసివేయబడతాయి. ఆ తర్వాత, ఆలయం నుంచి రథయాత్ర ఊరేగింపు సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభమై జనరల్ బజార్ మీదుగా ఎమ్.జి.రోడ్‌లో కొనసాగుతుంది. అనంతరం రాత్రి 6:30 నుంచి 10:30 వరకు హిల్ స్ట్రీట్, రాణిగంజ్ గుండా వెళుతుంది. మరుసటి రోజు ఉదయం 4:00 గంటలకు తిరిగి రథయాత్ర ఆలయానికి చేరుకుంటుంది.

ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ఫౌండర్ ఫ్యామిలీ ట్రస్టీ పురుషోత్తం మలాని మాట్లాడుతూ.. “ప్రతీ ఏటా భగవంతుని జగన్నాథ రథోత్సవాన్ని ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది, సికింద్రాబాద్- హైదరాబాద్ జంట నగరాల నుంచి భక్తులు భారీగా హాజరై భగవంతుని ఆశీర్వాదాలు పొందుతారని ఆశిస్తున్నామ”ని తెలిపారు. దర్శన నిమిత్తం పైన పేర్కొన్న విషయాలను అందరూ గమనించాలని ఆయన కోరారు. సూచించిన సమయాలకు తదనుగుణంగా దర్శనాన్ని ప్లాన్ చేసుకుని పరమాత్ముని దీవెనలు పొందాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

Also Read: అమర్‌నాథ్ యాత్ర.. 52 రోజులు పాటు హరహర మహాదేవ స్మరణతో మార్మోగనున్న హిమగిరులు