Realme 11 Pro Plus 5G Sale : ఫస్ట్ డే సేల్‌లోనే 60వేల యూనిట్లకుపైగా అమ్ముడైన రియల్‌మి 11 ప్రో ప్లస్ 5G ఫోన్..

Realme 11 Pro Plus 5G Sale : భారత మార్కెట్లో మొదటి రోజు సేల్‌లో 60వేల యూనిట్లకు పైగా రియల్‌మి 11ప్రో ప్లస్ 5G ఫోన్ అమ్ముడైంది. తద్వారా, కంపెనీ అత్యధిక ఫస్ట్ సేల్స్ రికార్డు బద్దలు కొట్టింది.

Realme 11 Pro Plus 5G Sold Over 60,000 Units in India on First Day of Sale

Realme 11 Pro Plus 5G Sale : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి (Realme) రికార్డు సేల్స్‌తో 60వేల యూనిట్లకు పైగా విక్రయించినట్లు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఈ కొత్త అమ్మకాల మైలురాయిని చేరుకుంది. (Realme 11 Pro+ 5G) స్మార్ట్‌ఫోన్ పైన పేర్కొన్న రూ. 25వేల ధరల విభాగంలో కంపెనీ అత్యధిక మొదటి-సేల్స్ రికార్డును బద్దలు కొట్టినట్లు కంపెనీ పేర్కొంది. 200MP ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన రియల్‌మి 10 Pro+ 5G సక్సెసర్ ఫోన్ జూన్ 15న (Flipkart), (Realme.com) ద్వారా భారత మార్కెట్లో విక్రయించింది.

Read Also : Best 5G Phones in India : భారత్‌లో రూ. 15వేల నుంచి రూ. లక్ష 50వేల ధరలో బెస్ట్ 5G ఫోన్‌లు ఇవే.. డోంట్ మిస్..!

రియల్‌మి 11 Pro+ 5G AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. MediaTek Dimensity 7050 SoCపై రన్ అవుతుంది. 5,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. Realme 11 Pro+ 5Gకి దేశ మార్కెట్లో అద్భుతమైన స్పందన వచ్చింది. ఒక రోజులో 60వేల యూనిట్లకు పైగా విక్రయించినట్లు ట్విట్టర్ (Realme) ప్రకటించింది. రియల్‌మి ప్రకారం.. రూ. 25వేల ధర విభాగంలో కంపెనీ అత్యధిక మొదటి-సేల్స్ రికార్డ్ క్రియేట్ చేసింది.

Realme 11 Pro Plus 5G Sale Over 60,000 Units in India on First Day of Sale

అదనంగా, రియల్‌మి 11 Pro+ 5G, Realme 11 Pro 5G ఫోన్ రెండూ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 20వేల నుంచి రూ. 30వేల సెగ్మెంట్‌లో అత్యధిక ‘ఫస్ట్ సేల్’ రికార్డ్‌గా నిలిచింది. భారత మార్కెట్లో (Realme 11 Pro+ 5G) బేస్ (8GB RAM + 256GB స్టోరేజ్) మోడల్‌ ప్రారంభ ధర రూ. 27,999 ఉంటుంది. అయితే, 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా ఉంది. ఆస్ట్రల్ బ్లాక్, ఒయాసిస్ గ్రీన్, సన్‌రైజ్ బీజ్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. మరోవైపు Realme 11 Pro 5G ధర రూ. 23,999 నుంచి ప్రారంభమవుతుంది.

Realme 11 Pro+ 5G స్పెసిఫికేషన్స్ :
Realme 11 Pro+ 5G 6.7-అంగుళాల ఫుల్-HD+ (1,080 x 2,412 పిక్సెల్‌లు) కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. Mali-G68 GPUతో ఆక్టా-కోర్ 6nm MediaTek డైమెన్సిటీ 7050 SoC, గరిష్టంగా 12GB RAM ద్వారా అందిస్తుంది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 200MP శాంసంగ్ HP3 ప్రైమరీ సెన్సార్‌తో పాటు 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్‌ను కలిగి ఉంది. ఇందులో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. Realme 11 Pro+ 5Gకి 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది.

Read Also : WhatsApp Multi Account : వాట్సాప్ మల్టీ అకౌంట్ ఫీచర్ వచ్చేస్తోంది.. ఒకే డివైజ్‌లో మరో అకౌంట్‌కు ఈజీగా మారవచ్చు..!

ట్రెండింగ్ వార్తలు