Ram Charan-Sreeja: ముంబై నుండి శ్రీజ ఎమోషనల్ పోస్ట్.. అసలేం జరుగుతుంది?

మెగాస్టార్ చిరంజీవి వారసులు, చిన్న కుమార్తె శ్రీజ అన్నయ్య రామ్‌ చరణ్‌ ముంబై విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు.

Ram Charan-Sreeja: మెగాస్టార్ చిరంజీవి వారసులు, చిన్న కుమార్తె శ్రీజ అన్నయ్య రామ్‌ చరణ్‌ ముంబై విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు. అనుకోకుండా చెల్లెలు శ్రీజతో కలిసి చరణ్ ముంబై లో కనిపించడంతో ఇక్కడ ఫోటోగ్రాఫర్లు వరుస పెట్టి ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు కాస్త ఆదివారం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కాగా.. అసలెందుకు ఈ వారసులు ఇద్దరూ ముంబై వెళ్లారు అనే చర్చలు కూడా సహజంగానే మొదలయ్యాయి.

Pushpa: హిందీలో వంద కోట్ల క్లబ్ లో చేరిన పుష్ప!

శ్రీజ చరణ్ తో కలిసి ముంబై ఎందుకు వెళ్లిందా అనే చర్చ అలా జరుగుతుండగా శ్రీజ చరణ్ తో టైం స్పెండ్ చేస్తూనే ఎమోషన్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. శ్రీజ తన అన్నయ్య రామ్‌ చరణ్‌ తో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేస్తూ ఒక ఎమోషనల్ మెసేజ్ కూడా పోస్ట్ చేసింది. ‘హగ్స్ అండ్‌ హగ్స్‌. నేను బతకడానికి నాకు ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చే చిన్న చిన్న విషయాలివే’ అంటూ శ్రీజ మెసేజ్ చేసింది.

Film Release Clash: మహేష్-చిరు.. తగ్గేది ఎవరు.. వచ్చేది ఎవరు?

శ్రీజ పోస్ట్ చేసిన మాటలను బట్టి ఆమె ఎమోషనల్‌ అవుతూ ఈ పోస్ట్ పెట్టిందని అర్ధమవుతుంది. అయితే.. దేనికి శ్రీజ ఇంతగా ఎమోషనల్ అవుతుందనే చర్చ జరుగుతుంది. భర్త కళ్యాణ్ దేవ్ తో వివాదాలున్నాయని.. డైవర్స్ అంటూ జరిగిన ప్రచారాన్ని ఈ మధ్యనే ఫోటోలతోనే క్లారిటీ ఇచ్చిన శ్రీజ ఈ మధ్య కాలంలో ఫ్యామిలీతో గడిపేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందని.. అందులో భాగమే ఇలా చరణ్ తో ముంబై వెళ్లిందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు