Prabuthwa Junior Kalashala : క్యూట్ లవ్ స్టోరీ.. ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ రిలీజ్ డేట్ అనౌన్స్..

యదార్థ సంఘటన ఆధారంగా చేసుకుని ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ఈ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ సినిమా తెరకెక్కింది.

Love Story Movie Prabuthwa Junior Kalashala Releasing Date Announced

Prabuthwa Junior Kalashala : ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర.. పలువురు ముఖ్య పాత్రల్లో డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. బ్లాక్ యాంటీ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఓ యదార్థ సంఘటన ఆధారంగా చేసుకుని ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ఈ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా జూన్ 21న థియేటర్స్ లో విడుదల కానుంది.

Also Read : Love Today : జాన్వీ కపూర్ చెల్లితో ‘లవ్ టుడే’ రీమేక్.. స్టార్ హీరో తనయుడు హీరోగా..

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనాథ్ పులకురం మాట్లాడుతూ.. మా సినిమా జూన్ 21న రిలీజ్ అవుతుంది. సెన్సార్ పనులు కూడా అయిపోయాయి. విజువల్స్ చాలా అందంగా వచ్చాయి. ఇందులో లవ్ స్టోరీ మనసుకు హత్తుకునేలా ఉంటుంది అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ.. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ శంకర్ పిక్చర్స్ మా సినిమాని ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్ కి మంచి స్పందన వచ్చింది. గతంలో త్రివిక్రమ్ గారు టీజర్ రిలీజ్ చేసారు. త్వరలోనే సినిమా ప్రమోషన్స్ మొదలుపెడతాము అని తెలిపారు.