Love Today : జాన్వీ కపూర్ చెల్లితో ‘లవ్ టుడే’ రీమేక్.. స్టార్ హీరో తనయుడు హీరోగా..
లవ్ టుడే సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి.

Love Today Movie Remake in Bollywood with Kushi Kapoor and Aamir Khan Son
Love Today Remake : 2022లో తమిళ్ లో చిన్న సినిమాగా వచ్చిన ‘లవ్ టుడే’ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చిన లవ్ టుడే ప్రదీప్ రంగనాథన్ హీరోగా, దర్శకుడిగా తెరక్కించాడు. ఇవానా హీరోయిన్ గా నటించగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. లవర్స్ ఫోన్స్ మార్చుకునే కాన్సెప్ట్ తో ప్రేక్షకులను మెప్పించింది ఈ సినిమా. తెలుగులో కూడా డబ్బింగ్ రిలీజయి మంచి విజయం సాధించింది. కేవలం 5 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసింది.
ప్రస్తుతం లవ్ టుడే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి లవ్ టుడే రీమేక్ వార్తలు బాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా, జాన్వీ కపూర్ చెల్లి ఖుషి కపూర్ హీరోయిన్ గా అద్వైత్ చందన్ దర్శకత్వంలో లవ్ టుడే సినిమా రీమేక్ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Also Read : Hansika : టీవీలోకి వచ్చేసిన హన్సిక.. ఆ డ్యాన్స్ షోకి జడ్జిగా..
అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ మొదటి సినిమా మహారాజా ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఖుషి కపూర్ ఒక సినిమా చేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ లవ్ టుడే రీమేక్ లో నటించబోతున్నారు తెలుస్తుంది. ఇటీవల సౌత్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి రీమేక్ అయిన సినిమాలేవీ అంతగా సక్సెస్ అవలేదు. మరి సౌత్ ప్రేక్షకులని మెప్పించిన లవ్ టుడే బాలీవుడ్ లో సక్సెస్ అవుతుందా చూడాలి.