Hansika : టీవీలోకి వచ్చేసిన హన్సిక.. ఆ డ్యాన్స్ షోకి జడ్జిగా..

తాజాగా హన్సిక ఇప్పుడు టీవీ షోలోకి ఎంట్రీ ఇచ్చింది.

Hansika : టీవీలోకి వచ్చేసిన హన్సిక.. ఆ డ్యాన్స్ షోకి జడ్జిగా..

Hansika Motwani Entry into TV Shows with Dance Dhee show

Updated On : June 3, 2024 / 9:56 AM IST

Hansika : యాపిల్ బ్యూటీ హన్సిక ‘దేశముదురు’ సినిమాతోనే తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కెరీర్ మొదలుపెట్టింది. తెలుగులో చాలా మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ భామ ఆ తర్వాత తమిళ్, హిందీలో కూడా బిజీ అయింది. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న హన్సిక పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా హన్సిక చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా హన్సిక ఇప్పుడు టీవీ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ డ్యాన్స్ షో ఢీ(Dhee) ప్రతి సీజన్ లో ఓ కొత్త లేడి జడ్జ్ ని తీసుకువస్తారు. ఇటీవల ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ అయిపోగా మరో కొత్త సీజన్ మొదలవుతుంది. ఈ సారి కూడా సెలబ్రిటీ స్పెషల్ గానే ఢీ షో సాగనుంది. గత సీజన్ లో హీరోయిన్ ప్రణీతను జడ్జిగా తీసుకురాగా ఈ సీజన్ కి హన్సికను జడ్జిగా తీసుకువచ్చారు.

Also Read : Shraddha Kapoor : ప్రభాస్ ఇంటి దగ్గర్నుంచి ఫుడ్ పంపిస్తే.. శ్రద్ధ కపూర్ ఆసక్తికర కామెంట్స్..

ఢీ షోలో హన్సిక జడ్జిగా వస్తుందని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేయగా హన్సిక ప్రోమోలో సందడి చేసింది. ఇక హన్సికతో పాటు శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ కూడా జడ్జీలుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో ట్రెండింగ్ లో ఉంది. మీరు కూడా హన్సిక ఢీ షో ప్రోమో చూసేయండి..