Shraddha Kapoor : ప్రభాస్ ఇంటి దగ్గర్నుంచి ఫుడ్ పంపిస్తే.. శ్రద్ధ కపూర్ ఆసక్తికర కామెంట్స్..
తాజాగా హీరోయిన్ శ్రద్ధాకపూర్ మరోసారి ప్రభాస్ ఫుడ్ గురించి కామెంట్స్ చేసింది.

Shraddha Kapoor Interesting Comments on Prabhas Food
Shraddha Kapoor : ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రభాస్. ప్రభాస్ ఫుడ్ గురించి అందరికి తెలిసిందే. సినిమా సెట్స్ లో హీరోయిన్స్ కి, ఆర్టిస్టులకు ప్రభాస్ అప్పుడప్పుడు ఫుడ్ ఇంటినుంచి పలు రకాలు తెప్పించి మరీ పెడతాడు. ప్రభాస్ ఫుడ్ తో చేసే మర్యాదకు హీరోయిన్స్ ఆశ్చర్యపోయి దాని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఇప్పటిదాకా ప్రభాస్ తో పని చేసిన ప్రతి హీరోయిన్ ప్రభాస్ పెట్టిన ఫుడ్ గురించి మాట్లాడిన వాళ్ళే.
తాజాగా హీరోయిన్ శ్రద్ధాకపూర్ మరోసారి ప్రభాస్ ఫుడ్ గురించి కామెంట్స్ చేసింది. ప్రభాస్ తో శ్రద్ధాకపూర్ కలిసి సాహో సినిమాలో నటించింది. ఈ సినిమా చాలా స్టైలిష్ గా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించగా ప్రేక్షకులని మెప్పించింది. ఈ సినిమా షూట్ టైంలో కూడా శ్రద్ధ కపూర్ కి ప్రభాస్ పలుమార్లు ఇంటి నుంచి ఫుడ్ తెప్పించి పెట్టాడు.
Also Read : Krithi Shetty : రామ్ చరణ్ అంటే కృతి శెట్టికి ఇంత ఇష్టమా..? చరణ్ గురించి కృతి ఏం చెప్పింది అంటే..
తాజాగా శ్రద్ధ కపూర్ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయగా కింద కామెంట్స్ లో ఓ నెటిజన్ ప్రభాస్ తో మళ్ళీ ఎప్పుడు నటిస్తారు అని అడగ్గా.. ప్రభాస్ మళ్ళీ తన ఇంటి నుంచి ఫుడ్ పంపించినప్పుడు అని కామెంట్ చేసింది శ్రద్ధ కపూర్. దీంతో సాహో సినిమా వచ్చి ఐదేళ్లయినా శ్రద్ధ ఇంకా ప్రభాస్ పెట్టిన ఫుడ్ గుర్తుపెట్టుకుంది అంటే ప్రభాస్ ఏ రేంజ్ లో ఫుడ్ తెప్పించాడో అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.