Krithi Shetty : రామ్ చరణ్ అంటే కృతి శెట్టికి ఇంత ఇష్టమా..? చరణ్ గురించి కృతి ఏం చెప్పింది అంటే..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృతి రామ్ చరణ్ గురించి మాట్లాడింది.

Krithi Shetty : రామ్ చరణ్ అంటే కృతి శెట్టికి ఇంత ఇష్టమా..? చరణ్ గురించి కృతి ఏం చెప్పింది అంటే..

Krithi Shetty tells about Ram Charan why she likes Him

Updated On : June 3, 2024 / 8:41 AM IST

Krithi Shetty : ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయింది కృతిశెట్టి. బేబమ్మగా ప్రేక్షకులని మెప్పించి యూత్ కి ఫేవరేట్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత వరుస సినిమాలతో మెప్పిస్తుంది కృతిశెట్టి. ప్రస్తుతం కృతి తెలుగుతో పాటు తమిళ్, మలయాళం సినిమాల్లో కూడా బిజీగా ఉంది. శర్వానంద్ సరసన కృతిశెట్టి నటించిన మనమే సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మనమే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కృతిశెట్టి వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృతి రామ్ చరణ్ గురించి మాట్లాడింది. గతంలో కూడా చరణ్(Ram Charan) అంటే ఇష్టమని చెప్పింది కృతి. తాజాగా కృతి శెట్టి మాట్లాడుతూ.. నా ఫేవరేట్ హీరో రామ్ చరణ్. గతంలో కొన్ని తెలుగు సినిమాలు చూసాను కానీ రామ్ చరణ్ గారి రంగస్థలం సినిమా నాకు బాగా కనెక్ట్ అయింది. అందులో చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. అప్పట్నుంచి ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అంతే కాకుండా ఆయన గురించి చాలా విన్నాను. వర్క్ లో చాలా డెడికేటెడ్ గా ఉంటారు అని, అందరితో మంచిగా ఉంటారని, అందరికి రెస్పెక్ట్ ఇస్తారని విన్నాను. రామ్ చరణ్ తో ఛాన్స్ వస్తే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతాను. అలాగే ఆయనతో సినిమా ఛాన్స్ వస్తే ఆ సినిమా కోసం ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాను అని తెలిపింది.

Also Read : Klin Kaara – Kalki Bujji : చరణ్ కూతురు క్లిన్ కారాకు.. ప్రభాస్ కల్కి ‘బుజ్జి’ గిఫ్ట్.. వాళ్లకు కూడా..

రామ్ చరణ్ గురించి కృతిశెట్టి ఈ రేంజ్ లో చెప్పడం, చరణ్ గురించి మాట్లాడేటప్పుడు కృతి చాలా ఎగ్జైట్ ఫీల్ అవ్వడంతో కృతి శెట్టికి చరణ్ అంటే ఇంత ఇష్టమా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక చరణ్ అభిమానులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఫ్యూచర్ లో చరణ్ – కృతి కలిసి సినిమా చేస్తారేమో చూడాలి.