Klin Kaara – Kalki Bujji : చరణ్ కూతురు క్లిన్ కారాకు.. ప్రభాస్ కల్కి ‘బుజ్జి’ గిఫ్ట్.. వాళ్లకు కూడా..
రామ్ చరణ్ కూతురు క్లిన్ కారాకు కూడా ఈ బుజ్జి గిఫ్ట్ ని పంపించింది కల్కి టీమ్.

Kalki Movie Team Sends A special Bujji Gift to Ram Charan Daughter Klin Kaara
Klin Kaara – Kalki Bujji : ప్రభాస్ కల్కి సినిమా ప్రమోషన్స్ సరికొత్తగా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో క్యారెక్టర్స్ తో కాకుండా ప్రభాస్ వాడిన వెహికల్, బుజ్జి అనే చిన్ని రోబోతో కల్కి సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. కల్కి బుజ్జిని లాంచ్ చేయడానికి ఓ గ్రాండ్ ఈవెంట్ నే చేసారు. ఇక ఆ వెహికల్ ని దేశంలోని ప్రధాన నగరాల్లో తిప్పుతూ ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవలే బుజ్జి & భైరవ యానిమేషన్ సిరీస్ కూడా వచ్చింది.
బుజ్జి, భైరవ క్యారెక్టర్స్ తో ఈ సినిమాను పిల్లలకు బాగా దగ్గర చేయాలనుకుంటున్నారు మూవీ టీం. ఈ క్రమంలో బుజ్జి, భైరవ స్టిక్కర్స్, బొమ్మలు, టీ షర్ట్స్ అమ్ముతున్నారు కూడా. కొంతమందికి ఫ్రీగా కూడా ఇస్తున్నారు. తాజాగా సినీ పరిశ్రమలోని సెలబ్రిటీ పిల్లలకు కల్కి మూవీ టీమ్ నుంచి బుజ్జి & భైరవ స్పెషల్ గిఫ్టులు పంపిస్తున్నారు.
Also Read : Gam Gam Ganesha : బేబీ తర్వాత ‘గం గం గణేశా’తో అదరగొడుతున్న ఆనంద్.. ఇప్పటివరకు కలెక్షన్స్ ఎంతంటే..
రామ్ చరణ్ కూతురు క్లిన్ కారాకు కూడా ఈ బుజ్జి గిఫ్ట్ ని పంపించింది కల్కి టీమ్. ఈ గిఫ్ట్ లో ఆ వెహికల్ బొమ్మ, బుజ్జి రోబో బొమ్మ, కొన్ని స్టిక్కర్స్, కల్కి పోస్టర్స్, ఒక లెటర్ ఉన్నాయి. క్లిన్ కారా ఆ బుజ్జి వెహికల్ తో ఆడుకుంటున్న ఫోటోని ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి థ్యాంక్స్ చెప్తూ కల్కి టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పింది. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. అయితే ఈ ఫొటోలో కూడా క్లిన్ కారా ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.
అలాగే ఈ బుజ్జి గిఫ్టులు సినీ పరిశ్రమలోని మరి కొంతమంది సెలబ్రిటీల పిల్లలకు కూడా పంపించినట్టు సమాచారం. మొత్తానికి కల్కి సినిమా ప్రమోషన్స్ సరికొత్తగా ట్రై చేస్తున్నారుగా. పిల్లలకు దగ్గరయి వాళ్ళతో పాటు పెద్దలు కూడా ఈ సినిమాకు వచ్చేలా ప్రమోషన్స్ చేస్తున్నారు మూవీ టీం.