Gam Gam Ganesha : బేబీ తర్వాత ‘గం గం గణేశా’తో అదరగొడుతున్న ఆనంద్.. ఇప్పటివరకు కలెక్షన్స్ ఎంతంటే..
తక్కువ బడ్జెట్ లో చిన్న సినిమాగా వచ్చినా కలెక్షన్స్ బాగానే రాబడుతుంది గం గం గణేశా సినిమా.

Anand Deverakonda Gam Gam Ganesha Movie Collections Details
Gam Gam Ganesha Collections : బేబీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) తన స్టైల్ మార్చి ‘గం గం గణేశా’ సినిమాతో ఇటీవల మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతి శ్రీ వాత్సవ, నయన్ సారిక హీరోయిన్స్ గా ఉదయ్ శెట్టి దర్శకత్వంలో హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మాణంలో తెరకెక్కిన ‘గం గం గణేశా’ సినిమా థియేటర్స్ లో అదరగొడుతుంది.
ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను నవ్విస్తుంది ఈ సినిమా. సెకండ్ హాఫ్ అయితే ఫుల్ గా నవ్వుకుంటారు. ఇక క్లైమాక్స్ ట్విస్టులు అయితే ఓ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తాయి. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చేస్తుంది. తక్కువ బడ్జెట్ లో చిన్న సినిమాగా వచ్చినా కలెక్షన్స్ బాగానే రాబడుతుంది గం గం గణేశా సినిమా.
Also Read : NTR 31 : ఎన్టీఆర్ సినిమా ఏకంగా అన్ని దేశాల్లో షూటింగ్.. ప్రశాంత్ నీల్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడుగా..
గం గం గణేశా సినిమా మొదటి రోజు 1.82 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళ్లు చేసింది. రెండో రోజు దాదాపు 1.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండు రోజుల్లో 3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా నిన్న ఆదివారం దాదాపు రెండు కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తుంది. 5 కోట్ల బ్రేక్ ఈవెన్ తో ఈ సినిమా బరిలోకి దిగింది. అంటే ఆల్మోస్ట్ 5 కోట్లపైగా షేర్ రావాలి. ఇప్పటి వరకు 3 కోట్ల వరకు షేర్ వచ్చినట్టు సమాచారం. ఇంకో రెండు రోజుల్లో ఈ సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతుందని తెలుస్తుంది.
StronGGG footfalls in theatres on DAY 3 for #GamGamGanesha
Perfect family entertainerBook your tickets now https://t.co/GtfC7rBEGG
In Cinemas Now!#GGG @ananddeverkonda @UrsNayan @officialpragati @udaybommisetty #KedarSelagamsetty @thisisvamsik @saregamasouth @shreyasgroup pic.twitter.com/oUHE38jhLy
— Hylife Entertainments (@HylifeE) June 2, 2024
కామెడీ సినిమా కాబట్టి జనాలకు మరింత దగ్గరవుతుంది. ఇక సినిమా ఆల్రెడీ డిజిటల్ రైట్స్ కూడా అమ్ముడుపోయి నిర్మాతలకు ప్రాఫిట్స్ మిగిల్చిందని గతంలోనే నిర్మాతలు తెలిపారు. మూవీ యూనిట్ సక్సెస్ టూర్స్ తో బిజీగా ఉన్నారు.