NTR 31 : ఎన్టీఆర్ సినిమా ఏకంగా అన్ని దేశాల్లో షూటింగ్.. ప్రశాంత్ నీల్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడుగా..

జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌లో ఫుల్ బిజీగా ఉన్నారు

NTR 31 : ఎన్టీఆర్ సినిమా ఏకంగా అన్ని దేశాల్లో షూటింగ్.. ప్రశాంత్ నీల్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడుగా..

NTR 31 movie shoot is expected to happen in approximately 15 countries

Updated On : June 2, 2024 / 5:59 PM IST

జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ ప‌క్క దేవ‌ర షూటింగ్ చేస్తూనే మ‌రో ప‌క్క బాలీవుడ్ చిత్రం వార్ 2లోనూ న‌టిస్తున్నారు. ఈ రెండు సినిమాల త‌రువాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ఓ చిత్రంలో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ 31 వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఆగ‌స్టు నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని ఇప్ప‌టికే చిత్ర బృందం వెల్ల‌డించింది.

ఇదిలా ఉంటే.. ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త వైర‌ల్ అవుతోంది. దాదాపు 15 దేశాల్లో ఎన్టీఆర్ 31 షూటింగ్ జ‌ర‌గ‌నుంద‌ట‌. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లు అయ్యాయ‌ని అంటున్నారు. ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్ లో మెక్సికోలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంద‌ట‌. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకోనున్న‌ట్లు ఆ వార్త సారాంశం.

Indrani : ‘ఇంద్రాణి’ ట్రైలర్ చూశారా..? ఇండియన్ సూపర్ ఫోర్స్ ఓ రేంజ్‌లో ఉందిగా..

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ దేవ‌ర పార్ట్ 1తో బిజీగా ఉన్నాడు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. అక్టోబ‌ర్ 10న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా కనపడబోతున్నారు. శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.