Indrani : ‘ఇంద్రాణి’ ట్రైలర్ చూశారా..? ఇండియన్ సూపర్ ఫోర్స్ ఓ రేంజ్‌లో ఉందిగా..
తాజాగా ఇండియన్ సూపర్ వుమెన్ సినిమా 'ఇంద్రాణి - ఎపిక్ 1: ధరమ్ vs కరమ్' సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

Indian First Super Women Movie Indrani Trailer Released
Indrani Trailer : యానీయా, అంకిత, అజయ్, కబీర్ సింగ్.. ముఖ్య పాత్రల్లో స్టీఫెన్ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కుతున్న ఇండియన్ సూపర్ వుమెన్ సినిమా ‘ఇంద్రాణి – ఎపిక్ 1: ధరమ్ vs కరమ్’. శ్రేయ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై కేకే రెడ్డి, సుధీర్ వేల్పుల, జేసేన్ నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ఓ సాంగ్ రిలీజవ్వగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
Also Read : Honeymoon Express : హనీమూన్ ఎక్స్‌ప్రెస్ కోసం.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. భలే ఉందే ఈ సాంగ్..
ట్రైలర్ లో.. 2122 సంవత్సరాలో కథ జరుగుతున్నట్టు, ఇండియన్ సూపర్ ఫోర్స్ అని ఒక సంస్థ స్థాపించినట్టు, మూడో ప్రపంచ యుద్ధం రాబోతున్నట్టు, ఇండియా శక్తివంత దేశంగా మారినట్టు చూపించారు. సాయి కుమార్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ సాగింది. ఇక విజువల్స్, గ్రాఫిక్స్ అయితే హాలీవుడ్ రేంజ్ లో చూపించారు. ట్రైలర్ తో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. మీరు కూడా ఈ ఇంద్రాణి ట్రైలర్ చూసేయండి..
ఇంద్రాణి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ స్టీఫెన్ పల్లం మాట్లాడుతూ.. ఇంద్రాణి ఒక ఎపిక్ లాంటి సినిమా. మంచి కంటెంట్ తో, అద్భుతమైన VFX లతో ప్రేక్షకులని అలరిస్తుంది. ఇందులో లీడ్ రోల్ తో పాటు ఒక రోబో కూడా ఉంటుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఉంది. వందేళ్ళ తర్వాత ఎలాంటి టెక్నాలజీ ఉంటుందో, అప్పుడు మన దేశం ఎలా ఉంటుందో సినిమాలో చూపించబోతున్నాం. యానీయా ఇండియన్ సూపర్ వుమన్ గా బాగా నటించింది. ఇంద్రాణి మాస్ మార్వెల్ లాంటి పాత్ర అని తెలిపారు.
నటుడు కబీర్ సింగ్ మాట్లాడుతూ.. ఇలాంటి సినిమాని ఒక విజువల్ వండర్ గా తీర్చి దిద్దినందుకు డైరెక్టర్ స్టీఫెన్ కి హ్యాట్సప్ చెప్పాలి. ఇంద్రాణి ఫస్ట్ ఇండియన్ సూపర్ వుమన్ సినిమా. ఇందులో సూపర్ విలన్ గా చేశాను. ఇది థియేటర్స్ లో చూడాల్సిన సినిమా అని అన్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ మాట్లాడుతూ.. ఇంద్రాణిలో నెక్స్ట్ లెవల్ విజువల్స్ ఉంటాయి. ఈ సినిమాకు సాంగ్స్ చాలా డిఫరెంట్ గా చేశాం అని తెలిపారు. ఇక ఈ సినిమా జూన్ 14న రిలీజ్ కాబోతుంది.