Chandrababu Naidu
AP Assembly Election Results 2024 : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి సునామీ సృష్టించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారీ సంఖ్యలో సీట్లను టీడీపీ కూటమి కైవసం చేసుకుంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 155కుపైగా నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తున్నారు. దీంతో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. కూటమి గెలుపు ఖాయం కావడంతో నాల్గోసారి చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈనెల 9న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఇవాళ రాత్రికి చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఈ భేటీలో కూటమి ప్రభుత్వంలో తొలి విడత మంత్రులుగా ఎవరెవరిని ఎంపిక చేయాలనే విషయంపై పవన్ తో చంద్రబాబు చర్చించి ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. వీరి మధ్య ఓ అవగాహన కుదిరిన తరువాత ఈనెల 9న సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నారు.