Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు వెల్లువెత్తుతున్న అభినందనలు.. ట్వీట్స్ చేస్తున్న హీరోలు, డైరెక్టర్లు, సెలబ్రిటీలు..

జనసేన గెలుస్తుండటంతో పవన్ కు కంగ్రాట్స్ చెప్తూ పలువురు హీరోలు, డైరెక్టర్స్, నిర్మాణ సంస్థలు, సినీ ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్నారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు వెల్లువెత్తుతున్న అభినందనలు.. ట్వీట్స్ చేస్తున్న హీరోలు, డైరెక్టర్లు, సెలబ్రిటీలు..

Pawan Kalyan

Updated On : June 4, 2024 / 4:52 PM IST

Pawan Kalyan : ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుండటంతో కూటమికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ విజయంలో జనసేన ముఖ్య పాత్ర పోషించడంతో పాటు జనసేన కూడా పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో దూసుకుపోతుంది. దీంతో సినీ పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సినీ పరిశ్రమలో అనేకమంది డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా జనసేనకు, కూటమికి సపోర్ట్ చేశారు. ఇప్పుడు జనసేన గెలుస్తుండటంతో పవన్ కు కంగ్రాట్స్ చెప్తూ పలువురు హీరోలు, డైరెక్టర్స్, నిర్మాణ సంస్థలు, సినీ ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్నారు.