Pawan Kalyan : ఏపీ ఎన్నికల ఫలితాల వేళ.. పవన్ OG నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. ఎవ్వరికి అందదు అతని రేంజ్..

తాజాగా OG సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు.

Pawan Kalyan They Call Him OG Movie New Poster Released on AP Elections Results Time

Pawan Kalyan OG Movie Poster : ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి. ఇన్నేళ్ల నిరీక్షణకు ఫలితంగా జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో లీడింగ్ తో దూసుకెళ్తుంది. దీంతో సినీ పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పవన్ కు కంగ్రాట్స్ చెప్తూ పోస్టులు చేస్తున్నారు.

Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు వెల్లువెత్తుతున్న అభినందనలు.. ట్వీట్స్ చేస్తున్న హీరోలు, డైరెక్టర్లు, సెలబ్రిటీలు..

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో గెలుస్తుండటంతో తన సినిమాల నుంచి ఇవాళ అప్డేట్స్ రానున్నాయి అని తెలుస్తుంది. తాజాగా OG సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పవన్ చాలా స్టైలిష్ గా కనిపిస్తూ కుర్చీలో కూర్చొని ఉన్నారు. దీంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది.

నిర్మాణ సంస్థ DVV మూవీస్ పవన్ OG పోస్టర్ ని రిలీజ్ చేస్తూ.. ఎవరికీ అందదు అతని రేంజ్.. రెప్ప తెరిచేను రగిలే రివెంజ్ అని డైలాగ్ కూడా పోస్ట్ చేశారు. అలాగే OG టైం బిగిన్స్ అంటూ రాసుకొచ్చారు. దీంతో పవన్ గెలుస్తుండటంతో పాటు, సినిమా అప్డేట్స్ కూడా వస్తుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు.