Stars Divorce: ఏళ్ల బంధానికి గుడ్ బై.. మా కొద్దీ పెళ్లిళ్లంటున్న స్టార్స్

సినిమాల్లోనూ.. సినిమా ఇండస్ట్రీలోనూ విడాకులు కొత్తేం కాదు. ఈ మధ్యకాలంలో.. చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ డివోర్స్ వే లో నడుస్తున్నారు. కోవిడ్ టైమ్ లో సినిమాలు బ్రేక్ అవ్వడం, కోవిడ్..

Stars Divorce: సినిమాల్లోనూ.. సినిమా ఇండస్ట్రీలోనూ విడాకులు కొత్తేం కాదు. ఈ మధ్యకాలంలో.. చాలా మంది సెలబ్రిటీ కపుల్స్ డివోర్స్ వే లో నడుస్తున్నారు. కోవిడ్ టైమ్ లో సినిమాలు బ్రేక్ అవ్వడం, కోవిడ్ ఎఫెక్ట్ తగ్గగానే సినిమాల సీజన్ రావడం అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కాని, సినీ సెలబ్స్ డివోర్స్ సీజన్ నే ఎవరూ ఊహించలేదు.

Celebrities Divorce: విడాకులందు.. సినిమా వాళ్ళ విడాకులు వేరయా!

లేటెస్ట్ గా కోలీవుడ్ డైరెక్టర్ బాల ఆయన వైఫ్ ముత్తు మలర్ తో ఫామిలీ కోర్టు నుంచి విడాకులు తీసుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా నాలుగు సంవత్సరాల నుంచి వేరు వేరుగా జీవిస్తున్న వీళ్లు, 17 ఏళ్ల వైవాహిక జీవితానికి విడాకులతో ముగింపు పలికారు. ఈ ఇద్దరు దంపతులకు ఒక పాప కూడా ఉంది. డైరెక్టర్ బాలకు తమిళంతో పాటు తెలుగులో కూడా ఫాన్స్ ఉన్నారు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన శేషు, వాడు వీడు, శివపుత్రుడు లాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు.

Divorce : పాట నచ్చలేదని భార్యకు విడాకులిచ్చిన కొత్త పెళ్లికొడుకు

గ్లామరస్ కపుల్‌గా.. చైసామ్‌కు వచ్చినంత క్రేజ్ ఎవరికీ రాలేదు. అందుకే.. వాళ్ల విడాకులపై.. ఓ రేంజ్ లో డిబేట్ జరిగింది. సమంత-నాగచైతన్య డివోర్స్ టాపిక్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రీసెంట్ గా తమిళ స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్య విడాకుల సీన్ అటు రజనీకాంత్, ఇటు ధనుష్ అభిమానులకు నిరాశ కలిగించింది.

Divorce Settlement : రూ.5,500 కోట్ల భరణం.. ప్రపంచంలోనే అతిపెద్ద విడాకుల సెటిల్‌మెంట్ ఇదే..!

టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ కూడా అందుకు అతీతమేం కాదు. హృతిక్ రోషన్, సుసాన్ ఖాన్ వైవాహిక జీవితం.. దాదాపు పదేళ్ల పాటు ఆనందంగా గడిచింది. వీరి ప్రేమకు ప్రతిరూపంగా ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా విడిపోయి షాకిచ్చారు. బాలీవుడ్‌ మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ ఆమిర్ ఖాన్‌ కూడా తన రెండో భార్య కిరణ్‌రావుకు విడాకులిచ్చేశారు. పదిహేనేళ్ల తమ వివాహ బంధానికి.. డివోర్స్‌తో పుల్ స్టాప్ పెట్టేశారు. తమ బిడ్డలకు పేరెంట్స్‌గా ఉంటూనే.. వేర్వేరుగా జీవించాలని నిర్ణయించుకున్నారు. వీరి బాటలోనే డైరెక్టర్ బాల కపుల్ లాంగ్ లైఫ్ పాట్నర్ రిలేషన్ ని బ్రేక్ చేసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు