Taj Mahal: అత్యధిక ఆదాయం సంపాదించిన కట్టడంగా తాజ్‌ మహల్

దేశంలోనే పర్యాటక రంగంలో అత్యధిక ఆదాయం సమకూర్చిన చారిత్రక కట్టడంగా నిలిచింది తాజ్ మహల్. మూడేళ్లలో రూ.132 కోట్ల ఆదాయం సమకూర్చినట్లు ఏఎస్ఐ వెల్లడించింది. కోవిడ్ సమయంలోనూ పర్యాటకుల్ని ఆకర్షించింది.

Taj Mahal: భారత దేశం అనగానే విదేశీ పర్యాటకులకు మొట్టమొదట గుర్తొచ్చే పర్యాటక ప్రదేశం తాజ్‌ మహల్‌. మన దేశంలోని పర్యాటకుల్ని కూడా ఇది విపరీతంగా ఆకర్షిస్తుంది. అలాంటి తాజ్ మహల్ ప్రస్తుతం దేశంలోనే అత్యధిక ఆదాయం సమకూర్చిపెడుతున్న చారిత్రక కట్టడంగా నిలిచింది.

Encounter: పంజాబ్‌లో ఎన్‌కౌంటర్.. పోలీసులు, సిద్ధూ మూసేవాలా హంతకులకు మధ్య కాల్పులు

తాజ్ మహల్‌కు మూడేళ్లలో దాదాపు రూ.132 కోట్ల ఆదాయం సమకూరినట్లు ‘ద ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)’ వెల్లడించింది. కోవిడ్ సందర్భంగా కూడా ఇతర పర్యాటక ప్రదేశాలతో పోలిస్తే తాజ్ మహల్‌కే ఎక్కువ ఆదాయం సమకూరినట్లు తెలిపింది. 2019-20 కాలంలో, కోవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ రూ.97.5 కోట్ల ఆదాయం పొందింది. ఈ సమయంలో ఇతర పర్యాటక ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. దేశంలో ఏఎస్ఐ ఆధ్వర్యంలో అనేక చారిత్రక ప్రాంతాలున్నాయి. ఈ ప్రదేశాలకు వచ్చే వారికి ఎంట్రీ ఫీజులు, ఇతర సేవల విషయంలో ఛార్జీలు వసూలు చేస్తుంటారు. ఇలా ఏఎస్ఐకి భారీగా ఆదాయం వస్తుంటుంది. అయితే, ఏఎస్ఐకి వస్తున్న ఆదాయంలో 24 శాతం తాజ్ మహల్ ద్వారానే వస్తుండటం విశేషం.

Maharashtra: వంద కోట్లకు ఎమ్మెల్యేకు మంత్రి పదవి పేరుతో మోసానికి యత్నం.. నిందితుల అరెస్టు

తాజ్ మహల్‌కు 2019-20 కాలంలో రూ.97.5 కోట్లు, 2021-22 కాలంలో రూ.25.61 కోట్ల ఆదాయం సమకూరింది. ఎంట్రీ టిక్కెట్ల ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏఎస్ఐ ఆధీనంలో 3,693 చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వాటిలో 143 ప్రదేశాల్లోకి టిక్కెట్ల ద్వారా పర్యాటకుల్ని అనుమతిస్తున్నారు. తాజ్ మహల్ తర్వాత ఎక్కువ ఆదాయం సమకూర్చిపెడుతున్న ప్రదేశాల్లో ఢిల్లీలోని కుతుబ్ మినార్, ఎర్రకోట, కోణార్క్‌లోని సూర్యదేవాలయం, ఖజురహో, ఎల్లోరా, ఆగ్రా కోట వంటివి ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు