Crow Temple Ringing Bell : గుడికి వచ్చి గుడి గంట మోగిస్తున్న కాకి .. అదీ పూజలు జరగని రోజుల్లోనే..!!

ఓ కాకి వినాయకుడి గుడిలో గంట కొడుతోంది. భక్తులు రాని రోజుల్లోనే వస్తుంది. పూజలు చేయని రోజుల్లోనే వచ్చి స్వామివారి గుడిలో గంట మోగించి వెళుతోంది.ఇదందా దైవలీల అంటూ ప్రజలు చెబుతున్నారు.

Crow Ringing bell in temple

Crow temple Ringing bell : విఘ్నేశ్వరుడి ఆలయంలో జరుగుతున్న అత్యంత విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ దేవాలయంలోకి ఓ కాకి రోజు వచ్చి గంట మోగిస్తోంది. తమిళనాడు తెన్‌కాశీ జిల్లాలో సెంగోటై సమీపంలోని చెరువు వద్ద ఓ చిన్న వినాయకుడి గుడికి ఓ కాకి వస్తుంది. వచ్చి గంట మోగించి తిరిగి ఎగురుకుంటు వెళ్లిపోతోంది. ఈ దేవాలయానికి భక్తులు ప్రతీరోజు రారు. కేవలం బుధవారం, శనివారాల్లో మాత్రమే వస్తారు. అదికూడా ఉదయం సమయంలోనే భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుని వెళ్లిపోతుంటారు. అంతేకాదు పూజారులు కూడా బుధ, శనివారాల్లో మాత్రమే వచ్చి స్వామికి పూజలు చేసి వెళ్లిపోతారు.

అంటే మిగతా రోజుల్లో విఘ్నేశ్వర స్వామికి ఎటువంటి పూజలు గానీ, ధూపదీప నైవేద్యాలు గానీ ఉండవు. కానీ స్వామివారు అలా ఉండకూడదని ఓ కాకి అనుకుందేమో..ఇదేదో దైవ సంకల్పంలా..ఓ కాకి స్వామివారికి పూజలు లేని రోజుల్లో వచ్చి గుడిలోని గంట మోగించి వెళుతోంది. ఇది ఎన్నాళ్లుగా జరుగుతోందో తెలియదు గానీ ఇటీవల కొంతమంది స్థానికులు కాకి గుడికి వచ్చి గంట మోగించటాన్ని చూశారు. అదేదో కాకతాళీకంగా కాకి వచ్చి గంటమీద వాలితే మోగుతోందేమో అనుకున్నారు. కానీ తరచు కాకి వచ్చి గంట మోగించటం అదికూడా పూజలు లేని రోజుల్లో వచ్చి గంట మోగించడాన్ని స్థానికులు గమనించారు. దీంతో కాకి స్వామివారిపట్ల ప్రదర్శించే భక్తి గురించి చర్చకు దారి తీసింది. ఈ ఘటనలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Bonalu Festival : తెలంగాణలో బోనాల పండగ సందడి.. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి మొదటి బోనం

పూజలు లేని రోజుల్లో ఓ కాకి ఉదయం 7 గంటలకు, సాయంత్రం 5 గంటలకు వచ్చి గంట మోగిస్తుంటుంది. బుధ,శనివారాలు తప్ప భక్తులు గానీ, పూజలుగానీ అటువైపుగా రారు. కానీ ఆ దేవాలయానికి సమీపంలో ఓ టీ షాపు ఉంది. ఆ షాపు వ్యక్తి కాకి ఇలా వచ్చి గంట మోగిస్తుంటాన్ని గమనించారు. ఓ రోజు దేవాలయం నుంచి గంట సౌండ్ రావటంతో అదేంటీ ఈరోజు పూజారులుగానీ భక్తులు గానీ రారు కదా గంట మోగిన సౌండ్ వస్తోందేంటీ? అని అనుకున్నాడు. ఆ తరువాత ఆ సౌండర్ పూజలు లేని రోజుల్లోనే వస్తుండటం విని ఆశ్చర్యపోయాడు.

ఆ రోజుల్లో దేవాలయపై దృష్టి పెట్టగా ఓ కాకి వచ్చి గంట మోగిస్తుండటాన్ని గమనించాడు. ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటనపై సదరు టీ షాపు యజమాని మాట్లాడుతు..మొదట్లో తాను అంతగా పట్టించుకోలేదని కానీ తరచు ఇలా పూజలు లేని రోజుల్లోనే గంట సౌండ్ వినిపించటంతో దృష్టి పెట్టగా కాకి వచ్చి గంట మోగిస్తోందని తెలిసిందని తెలిపారు. పూజ జరగని రోజుల్లోనే కాకి వచ్చి వెళుతుండటం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు.

Vijayawada Indrakiladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన ఆషాడమాసం సారె

 

 

ట్రెండింగ్ వార్తలు