Vijayawada Indrakiladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన ఆషాడమాసం సారె

వారాహి నవరాత్రులలో భాగంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, చీర జాకెట్ ను అమ్మవారికి సమర్పించారు. దేశం సస్యశామలంగా ఉండి పాడిపంటలతో అభివృద్ధి చెందేందుకు ఆషాడ మాసం సారెను సమర్పించారు.

Indrakiladri

Ashadamasam Sare : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా ఆషాడమాసం సారె ప్రారంభమైంది. తొలి రోజు వైదిక కమిటీ సభ్యులు అమ్మవారికి ఆషాడ మాసం సారె సమర్పించారు. మేళ తాళాలతో, మంగళ వాయిద్యాల నడుమ కనకదుర్గ నగర్ నుండి భారీ ఊరేగింపుగా వచ్చిన వైదిక కమిటీ సభ్యులు అమ్మవారికి సారెను సమర్పించారు.

వారాహి నవరాత్రులలో భాగంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, చీర జాకెట్ ను అమ్మవారికి సమర్పించారు. దేశం సస్యశామలంగా ఉండి పాడిపంటలతో అభివృద్ధి చెందేందుకు ఆషాడ మాసం సారెను సమర్పించారు. ప్రతి ఏడాది ఆషాడమాసంలో శాకంబరీ ఉత్సవాలు జరుగుతున్నాయి.

Half Day Schools: ఎండల ఎఫెక్ట్.. ఏపీలో 24వరకు ఒంటిపూట బడులు..

జులై 1, 2, 3 తేదీల్లో ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు నిర్వహించనున్నారు. వివిధ శాఖలతో మూడు రోజులపాటు దుర్గమ్మ దర్శనం ఇవ్వనుంది. ఈ ఆషాడ మాసంలో హైదరాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల కమిటీ విజయవాడ అమ్మవారికి బంగారపు బోనం సమర్పిస్తారు.

ట్రెండింగ్ వార్తలు