ఆ ప్రాంతంలో రోడ్లపై అమ్మాయిలను వేధిస్తున్న యువకులు.. చర్యలకు పవన్ కల్యాణ్ ఆదేశం

తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ, 6వ వార్డు, ఫస్ట్ లేన్ నుంచి మహిళలు..

pawan kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అమరావతిలోని తన కార్యాలయానికి ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించారు. తన శాఖలపై వచ్చిన అర్జీలతో పాటు ఇతర సమస్యల అర్జీలను కూడా పరిశీలించారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించడంతో పాటు, సమస్య తీవ్రతను బట్టి అధికారులతో మాట్లాడారు.

తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ, 6వ వార్డు, ఫస్ట్ లేన్ నుంచి మహిళలు, వృద్ధులు తెలియచేసిన సమస్యపై స్పందించారు. ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్ పై ప్రమాదకరంగా, వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థినులు, యువతులను, మహిళలను వేధిస్తున్నారని, వృద్ధులను భయపెడుతున్నారని ఓ లేఖలో పవన్ కు ఫిర్యాదు వచ్చింది.

అమ్మాయిల ఫొటోలు తీసి ఇంటర్నెట్లో పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, మద్యం తాగి ఇళ్ల ముందు భారీ శబ్దాలు చేస్తూ పాటలుపెట్టడం, ఇళ్లపై రాళ్ళు వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పిర్యాదు అందింది. నిందితుల ఫొటోలను, వాహనాల నంబర్లను సైతం తమ ఫిర్యాదుకు జత చేశారు బాధితులు.

ఆ యువకులు ఒక మహిళా ఎస్సైను సైతం వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితులు. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో ఫోన్ లో మాట్లాడారు పవన్. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ నుంచి వచ్చిన సమస్యను తక్షణమే పరిష్కరించాలి ఆదేశించారు.

Also Read: ఒక్క శాతం ఆదాయపన్ను కూడా కట్టకుండా చట్టబద్ధంగా ఎలా తప్పించుకోవచ్చో చెప్పిన యువకుడు

ట్రెండింగ్ వార్తలు