Film Industry : సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం.. ఇలా అయితే కష్టం అంటున్న ఫిలిం ఛాంబర్..

సినిమా టికెట్స్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ఫీజుపై 2 శాతం పన్ను విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Karnataka Government Sensation Decision on Film Industry Opposing from Film Industry People

Film Industry : ఇటీవల కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చింది. సినిమా టికెట్స్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ఫీజుపై 2 శాతం పన్ను విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ అసెంబ్లీలో బిల్లు కూడా ఆమోదం పొందింది. ఈ నిర్ణయంతో సినిమా టికెట్ రేట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ఫీజులు పెరుగుతాయి. అయితే ఈ నిర్ణయాన్ని కర్ణాటక ఫిలిం ఛాంబర్ వ్యతిరేకించింది.

తాజాగా కర్ణాటక ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు NM సురేష్ దీనిపై మాట్లాడుతూ.. ఇప్పటికే సినీ పరిశ్రమ అనేక కష్టాలు ఎదుర్కొంటుంది. కర్ణాటకలో 637 థియేటర్స్ ఉండగా అందులో దాదాపు 130 థియేటర్స్ మూసివేతకు దగ్గరగా ఉన్నాయి. థియేటర్ కి వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతున్న సమయంలో ప్రభుత్వం తీసుకునే ఇలాంటి నిర్ణయాలు సినీ పరిశ్రమకి మరిన్ని కష్టాలు తీసుకొస్తుంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆల్రెడీ కలిసి మాట్లాడాము. మరోసారి కలిసి మాట్లాడతాము. ఇటీవల అసెంబ్లీ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. గవర్నర్‌ కూడా ఆమోదం తెలిపితే అయిపోయినట్టే. అందుకే పన్ను తగ్గించే విషయం ఆలోచించమని సీఎం సిద్ధరామయ్యను మరోసారి కోరతాం. అలాగే థియేటర్‌ల సమస్యలు, కన్నడ సినిమాలకు రాయితీలు.. పలు సమస్యలపై కూడా చర్చిస్తాం అని తెలిపారు.

Also Read : Divya Alur : కొడుకు లేకపోవడంతో.. తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన లేడి యాంకర్..

మరి దీనిపై కర్ణాటక ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అసలు ఇప్పటికే థియేటర్ వ్యవస్థ పడిపోతూ సినీ పరిశ్రమ కూడా కష్టాల్లో ఉంటే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదని పలువురు కన్నడ సినీ పరిశ్రమ వ్యక్తులు కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు