Divya Alur : కొడుకు లేకపోవడంతో.. తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన లేడి యాంకర్..

ఇటీవల ఓ ప్రముఖ లేడి యాంకర్ తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన వీడియో వైరల్ గా మారింది.

Divya Alur : కొడుకు లేకపోవడంతో.. తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన లేడి యాంకర్..

Father Funeral Performed by Lady Anchor Divya Alur

Updated On : July 28, 2024 / 8:22 AM IST

Divya Alur : సాధారణంగా ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే వాళ్ళకి తలకొరివి కొడుకులే పెడతారు. కొడుకులు లేని పక్షంలో ఇప్పుడు కూతుర్లు కూడా తలకొరివి పెడుతున్నారు. ఇటీవల ఓ ప్రముఖ లేడి యాంకర్ తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన వీడియో వైరల్ గా మారింది. కన్నడ జానపద గాయకుడు, రచయిత ఆలూర్ నాగప్ప ఇటీవల మరణించారు. ఆయన కూతురు దివ్య ఆలూర్ కన్నడలో యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. పలు టీవీ షోలు, ఈవెంట్స్, బయట పొలిటికల్ మీటింగ్స్ కి యాంకరింగ్స్ చేస్తూ గుర్త్తింపు తెచ్చుకుంది.

Also Read : Adhyanth Harsha : న్యూరో సైన్స్‌లో PHD చేసి.. ఇప్పుడు డైరెక్టర్ గా సినిమాల్లోకి..

ఇటీవల ఆలూర్ నాగప్ప చనిపోవడంతో అతనికి కొడుకులు లేకపోవడంతో కూతురు ఆలూర్ దివ్య తనే తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాలని ఫిక్స్ అయింది. వాళ్ళ సంప్రదాయాల ప్రకారమే తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించింది దివ్య. అనంతరం తనే తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి తన తండ్రి దూరమయ్యారు అని ఎమోషనల్ పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారగా పలువురు ఆమెని అభినందిస్తున్నారు.