Chevireddy Mohit Reddy : చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని విడిచిపెట్టిన పోలీసులు

కొడుకు మోహిత్ రెడ్డి అరెస్టును మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. స్నేహితుడి వివాహానికి బెంగళూరు నుంచి దుబాయ్ కు వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారని అన్నారు.

chevireddy mohit reddy

Chevireddy Mohit Reddy : వైఎస్ఆర్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ చార్జి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ వెళ్తున్న ఆయన్ను బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి డీఎస్పీ రవిమనోహరాచారి నేతృత్వంలో బృందం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. అసెంబ్లీ పోలింగ్ మరుసటి రోజు టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో మోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం ఆయన్ను తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు.

Also Read : Chevireddy Mohith Reddy : వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్!

తిరుపతిలోని ఎస్వీయూ పీఎస్ కు ఆదివారం ఉదయం మోహిత్ రెడ్డిని తీసుకొచ్చిన పోలీసులు.. కొద్దిసేపు విచారించారు. అనంతరం 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు. విదేశాలకు వెళ్లకూడదని పోలీసులు షరతులు విధించారు. పోలీసుల విడుదల అనంతరం పీఎస్ వద్ద మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. కేవలం నోటీసులివ్వడం కోసం పోలీసులు ఇంత హంగామా ఎందుకు అటూ ప్రశ్నించారు. తీవ్రవాదులు, ఆర్థిక నేరగాళ్ల తరహాలో లుకౌట్ నోటీసులివ్వడం దారుణం. నానిపై హత్యయత్నం కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఘటన జరిగిన 52రోజుల తరువాత కేసులో నా పేరును చేర్చారు. కేసును న్యాయపరంగా ఎదుర్కొంటాం అని మోహిత్ రెడ్డి చెప్పారు.

Also Read : New Governors : తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియామకం!

అంతకుముందు కొడుకు మోహిత్ రెడ్డి అరెస్టును వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. స్నేహితుడి వివాహానికి బెంగళూరు నుంచి దుబాయ్ కు వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారని అన్నారు. విదేశాల్లో చదివిన తన కొడుకును వీధి పోరాటాలకు సిద్ధం చేస్తున్నారని, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు అంటూ భాస్కర్ రెడ్డి అన్నారు. మోహిత్ రెడ్డి అరెస్టు ను నిరసిస్తూ ఆదివారం ఉదయం తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ పీఎస్ సమీపంలోని రోడ్డుపై బైఠాయించిన భాస్కర్ రెడ్డి శాంతియుత నిరసనకు దిగారు. దీంతో భారీ సంఖ్యలో పోలీసులు బలగాలను మోహరించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు