New Governors : తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియామకం!

New Governors : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా జిష్షుదేవ్ వర్మ నియమితులయ్యారు.

New Governors : తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియామకం!

President Draupadi Murmu ( Image Source : Google )

Updated On : July 28, 2024 / 1:07 AM IST

New Governors : దేశవ్యాప్తంగా తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా జిష్షుదేవ్ వర్మ నియమితులయ్యారు.

రాజస్థాన్ గవర్నర్‌గా హరిభౌ కిషన్ రావు బాగ్డే, సిక్కిం గవర్నర్‌గా ఓం ప్రకాశ్ మాథుర్, ఝార్ఖండ్ గవర్నర్‌గా సంతోష్ కుమార్ గంగ్వార్, ఛత్తీస్‌గడ్ గవర్నర్‌గా రామన్ దేకా, మేఘాలయ గవర్నర్‌గా సి.హెచ్. విజయ్ శంకర్, మహారాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్, పంజాబ్ గవర్నర్‌గా గులాబ్ చంద్ కటారియా నియమితులయ్యారు.

తెలంగాణ కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గతంలో త్రిపుర డిప్యూటీ సీఎంగా పనిచేయగా, ఇప్పుడు గవర్నర్‌గా నియమితులయ్యారు. మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన సీపీ రాధాకృష్ణన్ జార్ఘండ్ గవర్నర్, తెలంగాణకు ఇన్‌ఛార్జిగా ఉన్నారు. పంజాబ్ కొత్త గవర్నర్ గులాబ్ చంద్ కటారియా అస్సోం గవర్నర్‌గా పనిచేస్తున్నారు. అసోం కొత్త గవర్నర్ లక్ష్మీ ప్రసాద్ ఆచార్య సిక్కిం గవ్నర్‌గా కొనసాగుతున్నారు.

Read Also : HMDA Allocations : హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనపై సర్కార్‌ ఫోకస్‌