Dhanush : డైరెక్టర్‌గా ధనుష్.. యాక్టింగ్ కూడా ఎలా చేసి చూపిస్తున్నాడో చూడండి.. వీడియో వైరల్..
రాయన్ సినిమా ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో దూసుకుపోతుంది.
- Saketh U
- Published On : July 28, 2024 / 09:50 AM IST
Raayan Movie Special Making Video Released on Dhanush Birthday
Dhanush : తమిళ్ స్టార్ హీరో ధనుష్ మల్టీ స్టారర్ అని తెలిసిందే. నటుడిగానే కాక సింగర్ గా, రచయితగా, దర్శకుడిగా.. ఇలా పలు విభాగాల్లో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా తనే హీరోగా నటిస్తూ రెండో సారి దర్శకత్వం వహించి రాయన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాయన్ రెగ్యులర్ స్టోరీ అయినా సరికొత్త స్క్రీన్ ప్లేతో ఆసక్తికర ట్విస్టులతో ప్రేక్షకులని మెప్పించింది.
రాయన్ సినిమా ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో దూసుకుపోతుంది. ఈ సినిమాలో మన తెలుగు హీరో సందీప్ కిషన్ కూడా ఓ ముఖ్య పాత్ర చేసి మెప్పించాడు. నేడు ధనుష్ పుట్టిన రోజు కావడంతో తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ రాయన్ సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు.
Also Read : Film Industry : సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం.. ఇలా అయితే కష్టం అంటున్న ఫిలిం ఛాంబర్..
ఈ వీడియోలో ధనుష్ డైరెక్టర్ గా వేరే యాక్టర్స్ కి ఎలా చేయాలి అని దగ్గరుండి చేసి మరీ చూపిస్తున్నాడు. డ్యాన్స్ కూడా స్టెప్పులు వేసి చూపిస్తున్నాడు. ప్రతి సీన్ ని ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాడు. అలాగే సెట్లో సరదా సన్నివేశాలు కూడా చూపించారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారగా ధనుష్ ని అభిమానులు, నెటిజన్లు అభినందిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మేకింగ్ వీడియో మీరు కూడా చూసేయండి..
