YS Sharmila : మీకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి జగన్..? షర్మిల సంచలన ట్వీట్

ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న వైఎస్ జగన్ ప్రశ్నించడాన్ని షర్మిల తీవ్రంగా తప్పుబట్టారు.

YS Sharmila

YS Jagan Mohan Reddy : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ సంచలన ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వంలో ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని, వైసీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని పేర్కొంటూ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ధర్నాకు ఇండియా కూటమిలోని పలు పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలపకపోవడంపై శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యలకు ట్విటర్ వేదికగా షర్మిట కౌంటర్ ఇచ్చారు.

Also Read : Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లో నాలుగురోజుల్లో భారీగా తగ్గిన బంగారం ధర..? దుకాణాల్లో కొనుగోళ్ల జోష్

ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న వైఎస్ జగన్ ప్రశ్నించడాన్ని షర్మిల తీవ్రంగా తప్పుబట్టారు. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అంటూ ప్రశ్నించారు. పార్టీ ఉనికికోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..? 5ఏళ్లు బీజేపీతో అక్రమ సంబందం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టినందుకా? అంటూ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఆఖరికి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు.. ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం. క్రిష్టియన్ అయిఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చింది మీరు కాదా అంటూ షర్మిల ప్రశ్నించారు.

Also Read : రెడ్ బుక్ తెరవక ముందే.. జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నాడు: నారా లోకేశ్ సెటైర్లు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారు కదా? మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీనుంచి వచ్చిందా సంఘీభావం అంటూ షర్మిల ప్రశ్నించారు. మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్పా.. రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని షర్మిల చెప్పారు. సిద్ధం అన్నవాళ్లకు 11మంది బలం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు? అని షర్మిల ఎద్దేవా చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు