Bonalu Festival : తెలంగాణలో బోనాల పండగ సందడి.. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి మొదటి బోనం

ఆషాడం మొదలైందంటే తెలంగాణ వ్యాప్తంగా సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రాష్ట్ర పండుగని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

Golkonda bonalu

Golkonda Bonalu : తెలంగాణలో బోనాల పండగ సందడి మొదలైంది. హైదరాబాద్ గోల్కొండ కోటపైన జగదాంబ మహంకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పించనున్నారు. ఇక్కడ తొమ్మిది వారాలపాటు ప్రతి గురు ఆదివారాలలో బోనాల సందడి ఉంటుంది. ఇక ఆషాడం మొదలైందంటే తెలంగాణ వ్యాప్తంగా సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రాష్ట్ర పండుగని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

ఇవాళ(గురువారం) గోల్కొండ జగదాంబికా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలి పూజ నిర్వహించడానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ ఆలయానికి రానున్నారు. అయితే, గోల్కొండ కోటపైన ఆనవాయితీగా వస్తున్న మొదటి పూజ, మొదటి బోనాన్ని కుమ్మరులు సమర్పించారు.

CM KCR Tour: ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ టౌన్‌షిప్.. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

గోల్కొండలో బోనాలు మొదలయ్యాక తర్వాత నగరంలోని మిగతా ప్రాంతాల్లో ప్రారంభమవుతాయి. సిటీలో బోనాలు కోలాహలం నెలకొంటుంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో శ్రావణమాసంలో బోనాలు ప్రారంభమవుతాయి.  బోనాల పండగను ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

ట్రెండింగ్ వార్తలు