Tollywood Films : తెలంగాణలో సినిమా టికెట్ ధరలు పెరిగాయి..ఎంతంటే

కరోనా నష్టాన్ని కొంత భర్తీ చేసుకొనేందుకు టికెట్ పెంపుకు అవకాశం ఇవ్వాలని గతంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే.

Films Ticket Price Hike : టాలీవుడ్ కు తెలంగాణ సర్కార్ తీపి కబురు అందించింది. సినిమా టికెట్ల పెంపుకు పచ్చజెండా ఊపింది. ఈమేరకు 2021, డిసెంబర్ 24వ తేదీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నష్టాన్ని కొంత భర్తీ చేసుకొనేందుకు టికెట్ ల పెంపుకు అవకాశం ఇవ్వాలని గతంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే.

Read More : Siddharth : దోచుకుంటోంది రాజకీయ నేతలే..! ముందు మీ అవినీతి తగ్గించుకోండి

ఏసీ థియేటర్లలో కనిష్ట ధర రూ. 50, గరిష్ట టికెట్ ధర రూ. 150.
మల్టీఫ్లెక్స్ లో కనిష్ట టికెట్ ధర రూ. 100, గరిష్ట టికెట్ ధర రూ. 250.
మల్టీఫ్లెక్స్ రిక్లైనర్ సీట్లకు గరిష్టంగా రూ. 300.
టికెట్ ధరలకు జీఎస్టీ, నిర్వహణ చార్జీలు అదనం.

Read More : Call Data : యూజర్ల కాల్‌ డేటాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు… రెండేళ్లు పాటు భద్రపరచాలి

ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను భారీగా తగ్గించడంతో పలువురు నటులు దీనిపై స్పందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతినివ్వాలంటూ..గతంలో థియేటర్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. అనంతరం కోర్టు ఆదేశాల ప్రకారం…ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. సినీ రంగ ప్రముఖులతో పలు దఫాలు చర్చలు జరిగాయి. అధికారుల కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో టికెట్ ధరలు భారీగా పెరుగనున్నాయి.

Read More : Tiger 3 : సల్మాన్ సినిమాలో షారుఖ్.. స్క్రీన్ షేక్ అవ్వాల్సిందే..

ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ సినిమాలు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు కూడా విడుదలైన సంగతి తెలిసిందే. బాలకృష్ణ నటించిన అఖండ సంచలన విజయం సాధించింది. రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. 2021, డిసెంబర్ 24వ తేదీ నేచురల్ స్టార్ నటించిన శ్యామ్ సింగరాయ్ ఫిల్మ్ రిలీజైంది. తర్వాత..అల్లు అర్జున్ నటించిన పుష్ప, ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్, ఎన్టీఆర్ – రాంచరణ్ కాంబినేషన్ లో రూపొందిన ఆర్ఆర్ఆర్..ఇలా వరుస పెట్టి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి టాలీవుడ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

ట్రెండింగ్ వార్తలు