Jammu And Kashmir Encounter : జమ్మూకశ్మీరులో సోమవారం రాత్రి ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. కశ్మీరులోని కుల్గాం జిల్లాలోని హూరా గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. ఈ ఎదురుకాల్పుల్లో ఓ పోలీసుకు గాయాలయ్యాయి.(Jammu And Kashmir’s Kulgam) గాయపడిన పోలీసును ఆసుపత్రికి తరలించారు. ఎన్కౌంటర్ స్థలంలో మరణించిన ఉగ్రవాది వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని జమ్మూకశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Thanks Wagner Fighters : రష్యాలో రక్తపాతాన్ని నివారించినందుకు వాగ్నర్ ఫైటర్స్‌కు పుతిన్ కృతజ్ఞతలు
కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఉగ్రవాదుల కోసం మంగళవారం కూడా గాలింపు కొనసాగిస్తున్నామని జమ్మూకశ్మీరు పోలీసులు ట్వీట్ చేశారు. మరణించిన ఉగ్రవాది ఏ గ్రూపునకు చెందిన వ్యక్తి అనేది ఇంకా తేలలేదు.
Man Defecates On Air India Flight : ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడి మలవిసర్జన..అరెస్ట్
సరిహద్దుల్లో పాక్ నుంచి ఉగ్రవాదులు చొరబాటు యత్నం చేస్తున్న నేపథ్యంలో కుల్గాం జిల్లాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. కుప్వారా జిల్లాలోని కాలా జంగల్ వద్ద ఐదుగురు పాక్ ఉగ్రవాదులు భారత దేశంలో చొరబడుతుండగా జరిపిన కాల్పుల్లో వారు మరణించారు. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ వైపు నుంచి చొరబాట్లు సాగుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి.