Tollywood Heroes : రెండు పడవల మీద కాళ్లేయడం కాదు…రెండు చేతులా సంపాదించడం అంటున్న స్టార్స్..

ప్రెజెంట్ స్టార్ హీరో అంటే వెనుక ప్రొడక్షన్ హౌస్ ఉండాల్సిందే. ఓ మూవీకి సైన్ చేస్తున్నారంటే తమ బ్యానర్‌ను ఇన్వాల్వ్ చేస్తున్నారు టీటౌన్ హీరోలు..

Tollywood Heroes: ప్రెజెంట్ స్టార్ హీరో అంటే వెనుక ప్రొడక్షన్ హౌస్ ఉండాల్సిందే. ఓ మూవీకి సైన్ చేస్తున్నారంటే తమ బ్యానర్‌ను ఇన్వాల్వ్ చేస్తున్నారు టీటౌన్ హీరోలు. మరికొందరు ఒకడుగు ముందుకేసి వేరే హీరోలపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది రెండు పడవల మీద కాళ్లేయడం కాదు…రెండు చేతులా సంపాదించడం అనొచ్చా..?

సొంత బ్యానర్స్‌తో నిర్మాతలుగా మారుతున్నారు టాలీవుడ్ హీరోలు. వీలైతే డైరెక్ట్ ప్రొడ్యూస్ లేదంటే ఇతర బ్యానర్లతో కలిసి సినిమాల్ని నిర్మిస్తున్నారు. దీంతో రెమ్యూనరేషన్.. దాంతో పాటే ప్రాఫిట్ షేర్స్ దక్కుతున్నాయి. మధ్యలో డిస్ట్రిబ్యూషన్ కొందరికి బోనస్. ఇదంతా ఓ ప్రీప్లాన్ అనుకున్నా.. మరికొందకు కాస్త రీజనబుల్‌గా ఆలోచిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో నిర్మాణ సంస్థలను ఇంట్రడ్యూస్ చేసి.. వాటి ద్వారా లాభం పొందుతున్నారు. ఇంకొందరు మంచి కథ దొరికితే వేరే హీరోలపై ఇన్వెస్ట్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్.. నందమూరి కల్యాణ్ రామ్ బ్యానర్ ఇది. అన్నయ్యకు తన సినిమాల ప్రొడక్షన్‌లో భాగస్వామ్యం కల్పిస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు ఎన్టీఆర్. ఇంతకుముందు కల్యాణ్ రామ్ నిర్మాతగా ‘జై లవకుశ’ చేసిన యంగ్ టైగర్.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ అన్నింటిలో తమ బ్యానర్‌ను ఇన్వాల్వ్ చేస్తున్నారు. కొరటాల శివ – ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న తారక్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం యువ సుధ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలతో జత కలుస్తోంది ఎన్టీఆర్ ఆర్ట్స్.

గతంలో తన సిస్టర్ మంజుల ప్రొడక్షన్ హౌస్‌ను ప్రమోట్ చేశారు మహేష్ బాబు. తర్వాత సూపర్ స్టార్  డైరెక్ట్‌గా రంగంలోకి దిగి జీఎంబీ బ్యానర్‌ని ప్రారంభించారు. ఇతర బ్యానర్లతో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. ఇందులోనే తన సోదరి మంజుల.. సోదరుడు రమేష్ వంటి వారితో మైనర్ పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ‘శ్రీమంతుడు’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలకు కో-ప్రొడ్యూస్ చేసిన జీఎంబీ బ్యానర్ ప్రెజెంట్ ‘సర్కారు వారి పాట’ ను మైత్రీ మూవీమేకర్స్‌తో కలిసి నిర్మిస్తోంది. అటు అడవి శేష్ హీరోగా మేజర్ సినిమానూ తెరకెక్కిస్తోంది.

కొణిదెల ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించిన రామ్ చరణ్ వరుసగా తండ్రి చిరంజీవి సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా నరసింహా రెడ్డి’ తర్వాత ప్రెజెంట్ ‘ఆచార్య’.. ఆ తర్వాత ‘లూసిఫర్’ రీమేక్‌కి కూడా చరణే ప్రొడ్యూసర్. ప్రభాస్ ఫ్రెండ్స్‌తో  యువీ క్రియేషన్స్.. ఫ్యామిలీతో గోపీకృష్ణ మూవీస్ సంస్థలను రన్ చేస్తున్నారు. నితిన్‌కి సొంతంగా శ్రేష్ట్ మూవీస్ ఉంది. నాని నిర్మాతగా మారి వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ మీద చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీకి అన్నపూర్ణ స్టూడియోస్, దగ్గుబాటి ఫ్యామిలీకి సురేష్ ప్రొడక్షన్స్ సపోర్ట్‌నిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు