Faria Abdullah : టాలీవుడ్ టాలెస్ట్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.. అమ్మడి డ్రీమ్ రోల్ ఏంటంటే..

ఫరియా అబ్దుల్లా.. క్యూట్ స్మైల్ తో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. చిన్న సినిమాగా విడుదలై తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘జాతిరత్నాలు’ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయింది హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా..

Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. క్యూట్ స్మైల్ తో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. చిన్న సినిమాగా విడుదలై తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘జాతిరత్నాలు’ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయింది హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా.. నవీన్ పోలిశెట్టికి జంటగా చిట్టి (షామిలి) క్యారెక్టర్‌లో నేచురల్ యాక్టింగ్, బ్యూటిఫుల్ స్మైల్ అండ్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో అందర్నీ ఆకట్టుకున్న ఫరియా టాలీవుడ్‌లోనే టాలెస్ట్ హీరోయిన్.

ఈ విషయం ఇటీవల ట్రైలర్ రిలీజ్ అప్పుడు ప్రభాస్ పక్కన నిలబడితే కానీ అంత త్వరగా అర్థం కాలేదు. నవీన్ పోలిశెట్టి కూడా ఆటపట్టించాడు ఆమెని. చూడగానే ఆకట్టుకునే రూపం, చక్కని చిరునవ్వు ఫరియాకు ప్లస్. తన నటనకు ఫిదా అయిన తెలుగు ఫిలిం మేకర్స్ వరుస ఆఫర్లతో ముంచెత్తుతున్నారు.

మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమాలో ఫరియాకి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. మంచి మూవీస్‌తో ఆడియెన్స్‌ని ఆకట్టుకోవాలని, సైకో లాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ తన డ్రీమ్ రోల్ అని చెప్పుకొచ్చింది తెలుగమ్మాయి ఫరియా అబ్దుల్లా..

Chitti Video song : చిట్టి ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..

ట్రెండింగ్ వార్తలు