Chitti Video song : చిట్టి ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..

‘జాతిరత్నాలు’.. చిన్న సినిమాగా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ కలెక్షన్లు దుమ్ము దులుపుతుంది. పాండమిక్ తర్వాత ఓవర్సీస్ మార్కెట్‌లో మిలయన్ మార్క్ టచ్ చేసిన ఫస్ట్ మూవీగా ‘జాతిరత్నాలు’ రికార్డ్ క్రియేట్ చేసింది.

Chitti Video song: ‘జాతిరత్నాలు’.. చిన్న సినిమాగా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ కలెక్షన్లు దుమ్ము దులుపుతుంది. పాండమిక్ తర్వాత ఓవర్సీస్ మార్కెట్‌లో మిలయన్ మార్క్ టచ్ చేసిన ఫస్ట్ మూవీగా ‘జాతిరత్నాలు’ రికార్డ్ క్రియేట్ చేసింది.

నాన్‌స్టాప్‌గా రెండు గంటలపాటు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుని చాలా రోజులైంది అంటూ రిపీట్ ఆడియన్స్ పెరుగుతూనే ఉన్నారు సినిమాకి. నవీన్ పోలిశెట్టి, ఫరియా అబ్దుల్లా కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది.

‘‘చిట్టీ నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. పట్టుమని పేలిందా నా గుండె కల్లాసే’’.. ఈ సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. సోమవారం ‘చిట్టీ’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, ఎక్స్‌ప్రెషన్స్ సాంగ్‌కి ప్లస్ అయ్యాయి. సినిమాలానే ఈ వీడియో సాంగ్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడం పక్కా అనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు