Matka Movie : వరుణ్ తేజ్ ‘మట్కా’ మేకింగ్ వీడియో.. వరుణ్ కోసం ఎన్ని వాచ్‌లు, కళ్లజోడులు, చైన్లు తెచ్చారో చూడండి..

తాజాగా మట్కా మూవీ మేకింగ్ వీడియోని విడుదల చేసారు.

Varun Tej Pan India Movie Matka Making Video Released

Matka Movie : వరుణ్ తేజ్(Varun Tej), మీనాక్షి చౌదరి జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో మట్కా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా, 1960 బ్యాక్‌డ్రాప్‌తో, గ్యాంబ్లింగ్ తరహా కథాంశంతో ఈ సినిమా ఉండబోతుంది. వైరా ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో పాన్ ఇండియా సినిమాగా మట్కా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నోరా ఫతేహి, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

Also Read : Kalki Collections : ‘కల్కి’ సినిమా ఓపెనింగ్ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావొచ్చంటే.. RRR రికార్డ్ బద్దలుకొడుతుందా?

ఇటీవల కొన్నాళ్ళు షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన మట్కా ఇప్పుడు మళ్ళీ షూటింగ్ మొదలైంది. తాజాగా మట్కా మూవీ మేకింగ్ వీడియోని విడుదల చేసారు. ఈ వీడియోలో మట్కా కోసం వేస్తున్న సెట్స్, పీరియాడిక్ తగ్గట్టు షూటింగ్ సెటప్, వరుణ్ తేజ్ కోసం బోలెడన్ని కళ్లజోడులు, వాచ్ లు, చైన్లు, డ్రెస్ లు ఉండటం చూపించారు. రామోజీ ఫిలిం సిటీలో పీరియాడిక్ వైజాగ్ సెట్స్ వేసి ఈ సినిమా షూట్ చేస్తున్నారు. దీంతో మట్కా కోసం వరుణ్ బాగానే కష్టపడుతుండటంతో పాటు సినిమా కోసం బాగానే ఖర్చుపెడుతున్నట్టు తెలుస్తుంది. మీరు కూడా వరుణ్ తేజ్ మట్కా మేకింగ్ వీడియో చూసేయండి..