Prabhas Kalki 2898 AD Movie First Day Collections Expectations
Kalki Collections : ప్రభాస్ కల్కి సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా ఎదురుచూస్తుంది. హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతున్న ఈ సినిమా రేపు జూన్ 27న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పలుచోట్ల కల్కి సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా అన్ని చోట్ల టికెట్స్ అమ్ముడుపోయాయి. టికెట్ రేట్లు కూడా కల్కి సినిమాకు భారీగానే ఉన్నాయి. కల్కి సినిమా మీద ఉన్న హైప్, ఇప్పటికే బుకింగ్ అయిన టికెట్స్ చూస్తుంటే కల్కి సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ లో సరికొత్త రికార్డ్ కొడుతుందని భావిస్తున్నారు.
ఇటీవల ఇలాంటి భారీ సినిమాలన్నీ 1000 కోట్ల టార్గెట్ పెట్టుకొని రంగంలోకి దిగుతున్నాయి. కల్కి కూడా 1000 కోట్ల టార్గెట్ పెట్టుకొని దిగుతుంది. మొదటి వారంలోనే 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేస్తే ఈ సినిమా పెద్ద హిట్ అయినట్టే. టాలీవుడ్ సమాచారం ప్రకారం ఈ సినిమాకు దాదాపు 380 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. అంటే కనీసం 800 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే హిట్ అయినట్టు. దీనికి ఓపెనింగ్ డే కూడా చాలా ఇంపార్టెంట్.
Also Read : Rajamouli : మరోసారి రాజమౌళికి ఆస్కార్ ఆహ్వానం..
కల్కి సినిమా మీద ఉన్న హైప్ తో అందరి కళ్ళు కల్కి మొదటి రోజు కలెక్షన్స్ మీదే ఉన్నాయి. బాహుబలి తర్వాత నుంచి ప్రతి ప్రభాస్ సినిమా ఓపెనింగ్ రోజు ఈజీగా 100 కోట్లు దాటుతుంది. అయితే ఇప్పటివరకు RRR సినిమానే ఓపెనింగ్ రోజు హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ వచ్చిన సినిమాగా నిలిచింది. RRR సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 223 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డ్ సెట్ చేసింది. దీంతో కల్కి సినిమా RRR రికార్డ్ బద్దలు కొడుతుందా అని అంతా ఆలోచిస్తున్నారు.
ఇప్పటికే కల్కి సినిమాకు అమెరికాలో 3 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చేసాయి. అక్కడ ఆల్రెడీ RRR రికార్డ్ బద్దలుకొట్టేసింది కల్కి. ఇక తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు కూడా పెంచారు. షోలు కూడా ఎక్కువే వేస్తున్నారు. ఇప్పటికే ఓపెనింగ్ రోజు అన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ లో టికెట్స్ అన్ని బుకింగ్ అయిపోయాయి. దీంతో కల్కి సినిమా మొదటి రోజు ఈజీగా 200 కోట్ల గ్రాస్ దాటుతుందని, అన్ని కుదిరితే RRR మొదటిరోజు గ్రాస్ 223 కోట్లు కూడా దాటుతుందని ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి ప్రభాస్ తో పాటు అమితాబ్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, దీపికా.. ఇలాంటి చాలా మంది స్టార్ల కోసం అన్ని సినీ పరిశ్రమల నుంచి రిలీజ్ రోజే సినిమా చూస్తే ఈజీగా RRR రికార్డ్ బద్దలు కొట్టేయొచ్చు.