Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్.. పవన్, రాశీఖన్నా, శ్రీలీల.. ఎవరి రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు..?
గబ్బర్ సింగ్ తర్వాత పవన్ - హరీష్ కాంబోలో వస్తున్న సినిమా కావడం, ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. (Ustaad Bhagat Singh)
Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 19న ఉగాది రోజు రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్స్ గా నటించారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ – హరీష్ కాంబోలో వస్తున్న సినిమా కావడం, ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాకు భారీగానే ఖర్చుపెట్టారు. మొదట షూట్ మొదలుపెట్టి తర్వాత ఎన్నికలు, పవన్ రాజకీయాలతో బిజీ అవ్వడంతో మధ్యలో సినిమా ఆగిపోయింది. కొన్ని నెలల క్రితం పవన్ డేట్స్ ఇవ్వడంతో ఫాస్ట్ గా 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసారు. పవన్ డేట్స్ ఇవ్వడంతో రాశీఖన్నా, శ్రీలీల కూడా వేరే సినిమాలు చేస్తున్నా డేట్స్ అడ్జస్ట్ చేసారు.
Also Read : Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫొటోలు..
తన రాజకీయాల వల్ల ఈ సినిమా లేట్ అవ్వడం, నిర్మాతకు భారం పెరగడంతో తన రెమ్యునరేషన్ సగానికి పైగా తగ్గించుకొని పవన్ కళ్యాణ్ కేవలం 25 కోట్లే తీసుకున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక శ్రీలీల వేరే సినిమాలు కూడా వదులుకొని ఈ సినిమా మీదే ఉండటంతో తనకు 3 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తుంది. అలాగే రాశీఖన్నాకు 2 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారని సమాచారం.
సినిమా షూట్ వాయిదా పడినా మొదలయిన తర్వాత మాత్రం 45 రోజుల్లో షూటింగ్ ఫినిష్ చేసేయడంతో ప్రొడక్షన్ కాస్ట్ కాస్త తగ్గింది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు రెమ్యునరేషన్స్ తో కలుపుకొని దాదాపు 150 కోట్ల బడ్జెట్ అయినట్టు సమాచారం.
