Mahabubabad: అర్థరాత్రి టమాటాలు చోరీ.. బాక్సులు మాయం.. రంగంలోకి పోలీసులు

టమాటా ధరలు అమాంతం పెరగడంతో వాటికి భారీ డిమాండ్ ఏర్పడింది. గత పదిరోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో టమాటా, పచ్చిమిర్చి చోరీ జరిగింది. మూడు రోజులుగా రాత్రి సమయంలో టమాటా బాక్సులు చోరీ అవుతున్నాయి.

Tomato price: టామాటా ధరలు మండిపోతున్నాయి. గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కిలో టమాటా (Tomato) రూ.120 నుంచి రూ. 150 వరకు పలుకుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. ప్రస్తుతం ధరలను చూస్తుంటే మరో రెండుమూడు నెలల వరకు వీటి ధరలు అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించటం లేదని వ్యాపారాలు పేర్కొంటున్నారు. ఈ సమయంలో టమాటా కొనుగోలు చేసేందుకు పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు పచ్చిమిచ్చి ధరలుసైతం భారీగా పెరిగాయి. ధరల పెరుగులదలతో కూరగాయల మార్కెట్లకు వెళ్లేందుకుసైతం మధ్య తరగతి ప్రజలు వెనుకాడుతున్న పరిస్థితి.

Tomato Price Hike : మండుతున్న టమాటా ధరలు .. ట్విట్టర్లో కామెడీ మీమ్స్

టమాటా ధరలు అమాంతం పెరగడంతో వాటికి భారీ డిమాండ్ ఏర్పడింది. గత పదిరోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా మహబూబాబాద్ జిల్లా డోర్నల్ లో టమాట, పచ్చిమిర్చి చోరీ జరిగింది. మూడు రోజులుగా రాత్రి సమయంలో టమాటా బాక్సులు చోరీ అవుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు టమాటా, పచ్చిమిర్చి బాక్సులను ఎత్తుకెళ్లారు. టమాటా బాక్సులు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. టాటా ఏస్ వాహనంలో నుంచి టమాటా, పచ్చిమిర్చి బాక్సులు గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్తునట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఈ విషయం పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో పోలీసులు రంగంలోకి దిగారు. టమాటా దొంగల గుట్టువిప్పేందుకు వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

ట్రెండింగ్ వార్తలు