Tomato Price Hike : మండుతున్న టమాటా ధరలు .. ట్విట్టర్లో కామెడీ మీమ్స్

దేశ వ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో రూ.80 నుంచి రూ.100 పలుకుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ట్విట్టర్‌లో పెరుగుతున్న టమాటా ధరలపై ఫన్నీ మీమ్స్ నవ్వు పుట్టిస్తున్నాయి.

Tomato Price Hike : దేశ వ్యాప్తంగా పెరుగుతున్న టమాటా ధరలు చూసి వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కిలో రూ.80 నుంచి రూ.100 లు పలకడంతో కొనడానికి వెనకాడుతున్నారు. ఇక పెరిగిన టమాటా ధరలపై ట్విట్టర్లో మీమ్స్ ఊపందుకున్నాయి.

Google Employees : కాస్ట్ కటింగ్ అన్నారు.. సీఈఓ పిచాయ్‌‌‌ వేతనం భారీగా పెంచారు.. గూగుల్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి.. నెట్లింట్లో మీమ్స్ వైరల్..!

దేశ వ్యాప్తంగా కిలో టమాటా ధర రూ.80 నుంచి రూ.100 పలుకుతోంది. వినియోగదారుల్ని విస్మయానికి గురిచేస్తోంది. సాధారణ రోజుల్లో కంటే దీని ధర మూడు నుంచి నాలుగు రెట్లు ఒక్కసారిగా పెరిగిపోయింది. నిన్నా, మొన్నటి దాకా విపరీతమైన ఉష్ణోగ్రతలు, రుతుపవనాలు రావడంలో ఆలస్యం వంటి అనేక కారణాలు వీటి ధరల పెరుగుదలకు కారణమని నివేదికలు చెబుతున్నాయి. ఇక చాలామందికి టమాటా లేకపోతే వంట చేయడమే కష్టం. ఏ వంటకంలో అయినా తగిన రుచి కావాలంటే టమాటా యాడ్ చేయాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని బంగారంలాగ, పొదుపుగా వాడటం అంటే కష్టమే మరి. ఓ వైపు వీటి ధరలు విని ఆందోళన చెందుతూనే మరోవైపు ట్విట్టర్‌లో వీటి ధరలపై హాస్యాన్ని పండిస్తూ రకరకాల మీమ్స్ పోస్టు చేస్తున్నారు.

Twitter: ట్విట్టర్ బ్లూటిక్‌లు పోయాయి.. కడుపుబ్బా నవ్వించే మీమ్స్ వచ్చాయి..

‘ఉల్లిపాయ మాత్రమే కాదు టమాటా కూడా ఇప్పుడు కన్నీరు తెప్పిస్తోందని’.. ‘డీజీల్, పెట్రోలు ధరలకన్నా టమాటా ధర వేగంగా పరుగులు తీస్తోందని’ చెప్పే కొన్ని హాస్యపూరితమైన మీమ్స్ నవ్వు పుట్టిస్తున్నాయి. ధరలు తగ్గేవరకూ టమాటాను చూడటమే తప్ప కొనే పరిస్థితి కనిపించట్లేదని సామాన్యులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు