Video: సామూహిక వివాహాలు జరిపించి.. బంగారం, రూ.లక్ష, ఏడాదికి సరిపడా సరుకులు ఇచ్చిన ముకేశ్ అంబానీ

ఏడాదికి సరిపడా సరకులనూ కొత్త జంటలు అందుకున్నాయి. పెళ్లికి వచ్చిన వారికి విందు ఇచ్చారు..

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీకి రాధికా మర్చెంట్ తో మరో రెండు వారాల్లో పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ పేద కుటుంబాలకు చెందిన జంటలకు ముకేశ్ అంబానీ కుటుంబం సామూహిక పెళ్లిళ్లు జరిపించింది. ముంబై శివారులోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్ లో ఈ పెళ్లిళ్లు జరిగాయి. మొత్తం 50 జంటలు వివాహం చేసుకున్నాయి.

ముకేశ్ అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ వివాహాలకు హాజరయ్యారు. అక్కడ ఇవాళ పెళ్లి చేసుకున్న వారికి ముకేశ్ అంబానీ కుటుంం భారీగా కానుకలు ఇచ్చింది. బంగారు మంగళ సూత్రంతో పాటు ఉంగరాలు వంటి ఆభరణాలను కొత్త జంటలు అందుకున్నాయి.

అంతేగాక, ప్రతి పెళ్లికూతురికి రూ.లక్ష చొప్పున ఇచ్చింది ముకేశ్ అంబానీ కుటుంబం. ఏడాదికి సరిపడా సరకులనూ కొత్త జంటలు అందుకున్నాయి. పెళ్లికి వచ్చిన వారికి విందు ఇచ్చారు. మొత్తం 800 మందికి పైగా అతిథులు సామూహిక వివాహానికి హాజరయ్యారు. ముకేశ్ అంబానీ, నీతా అంబానీ ఆశీర్వాదాన్ని తీసుకున్నాయి కొత్త జంటలు. అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా నిరుపేదల సామూహిక వివాహాన్ని నిర్వహించారు.

 

 

Also Read: ఈ నెల 6న చంద్రబాబు, రేవంత్ భేటీ కానున్న వేళ.. తెలంగాణ సీఎంకి తుమ్మల లేఖ

ట్రెండింగ్ వార్తలు