అంతరిక్షంలోకి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లే అవకాశం ఉందా.. ఇస్రో చీఫ్‌ ఏం చెప్పారంటే?

ప్రధాని నరేంద్ర మోదీని స్వదేశీ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి పంపుతారా..? అన్న ప్రశ్నకు ఆయన ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు.

Gaganyaan mission: నయా భారత్.. అన్నింట్లో టాప్‌లో నిలిచే ప్రయత్నం చేస్తోంది. అంతరిక్ష పరిశోధనల్లోనూ అమెరికా, చైనా లాంటి అగ్రరాజ్యాలతో పోటీ పడి ఇస్రో ఎన్నో ప్రయోగాలు సాధించింది. అద్భుత విజయాలు కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు మానవ సహిత మిషన్‌ ప్రయోగానికి రెడీ అయింది. అదే గగన్‌యాన్‌ మిషన్. ఇది భారత మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర. ఈ గగన్‌యాన్‌ మిషన్‌ అనేది భారత్‌కు చాలా ప్రతిష్టాత్మకమైంది. ఈ మిషన్ సక్సెస్ అయితే ఇప్పటికే స్పేస్ రీసెర్చ్‌లో అమెరికా, చైనాతో పోటీపడుతున్న భారత్‌ మరో మెట్టుకు ఎదిగినట్లు అవుతుంది.

గగన్‌యాన్ మిషన్ భారతదేశం మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర. 2025 చివరిలో ఈ ప్రయోగాన్ని చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇస్రో. మూడు రోజుల మిషన్ కోసం నలుగుర్ని 400 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశపెట్టి, తిరిగి భారత సముద్రంలోకి దింపడం ద్వారా వారిని సేఫ్‌గా భూమి మీదకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వచ్చే ఏడాది చివరిలో రోదసీలోకి వ్యోమగాములు
ఎంతో ఇంపార్టెంట్ మిషన్‌ గగన్ యాన్‌. ఈ మిషన్ ద్వారా తొలిసారి మనుషులను అంతరిక్షంలోకి పంపనుంది ఇస్రో. ఇందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ మిషన్ కోసం నలుగురికి రష్యాలో శిక్షణ పూర్తయ్యింది. అలాగే క్రూ మాడ్యూల్ పరీక్షలు కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలో గగన్‌యాన్ గురించి ఇస్రో చీఫ్ కీలక వివరాలను తెలిపారు. వచ్చే ఏడాది చివరికి ప్రయోగం చేపట్టనున్నట్టు ప్రకటించారు.

ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌ చెప్పిన సమాధానం ఆసక్తికరంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీని స్వదేశీ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి పంపుతారా..? అన్న ప్రశ్నకు ఆయన ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. గగన్‌యాన్‌ మిషన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రధాని కూడా అక్కడికి వెళ్లొచ్చని చెప్పారు. మన దేశాధినేతను రోదసీలోకి పంపించగలిగే శక్తిసామర్థ్యాలు సమకూర్చుకుంటే మనందరికీ ఎంతో గర్వకారణమని కూడా కామెంట్ చేశారు సోమనాథ్‌.

వ్యక్తులను పంపడం అంత ఈజీ కాదు
గగన్‌యాన్‌ ద్వారా ముఖ్యమైన వ్యక్తులను పంపడం అంత ఈజీ కాదు. చాలా టెక్నికల్‌గా ఎంతో ఎక్స్ పర్టైజ్ అవసరమైన ఈ మిషన్‌‌లో భాగస్వామ్యం కావాలంటే నెలలు, ఏళ్ల తరబడి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధాని మోదీ వంటి నేతలకు ఎన్నో కీలక బాధ్యతలు ఉంటాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే వ్యోమగాములకు కొన్ని నెలలుగా ట్రైనింగ్‌ కొనసాగుతోంది. అలాంటిది ప్రధాని మోదీ అంత టైమ్ కేటాయించి శిక్షణ తీసుకోలేరు. ఈ నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ కామెంట్స్‌.. స్పేస్‌ రీసెర్చ్‌లో దేశం ఆ స్థాయికి ఎదగాలనే భావనే తప్ప.. మోదీని ఇప్పుడే అంతరిక్షంలోకి పంపిస్తామన్న ప్రకటన అయితే లేదు.

Also Read : హత్రాస్ ఘోర విషాదం.. ఎవరీ బోలే బాబా? ఏం చేస్తాడు? ఎలా పాపులర్ అయ్యాడు?

కీలక దశలో గగన్‌యాన్‌ మిషన్‌
ఇక గగన్‌యాన్‌ మిషన్‌ కీలక దశలో ఉంది. అందులో భాగంగా మూడు ముఖ్యమైన ప్రయోగాలు చేపట్టనున్నారు. ముందుగా వ్యోమగాములు ఒకరోజు అంతరిక్షంలోకి పంపి.. కక్ష్యలో కొద్దిసేపు గడిపి, తిరిగి భూమికి తీసుకురానున్నారు. రెండోది పరికరాలు, అల్గారిథమ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు. మూడో దశలో లాంచింగ్ ప్యాడ్‌ను పరీక్షిస్తారు. ఓవరాల్‌గా వచ్చే ఏడాది చివరి నాటికి మొదటి ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది ఇస్రో.

Also Read: సింపుల్‌గా రాకెట్‌లో రయ్‌మని స్పేస్‌లోకి దూసుకెళ్లొచ్చు.. ఎలాగో తెలుసా?

గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములు రోదసీలోకి వెళ్లి.. మూడు రోజుల తర్వాత భూమి మీదకు తిరిగి వస్తారు. ఈ మిషన్‌కు ఎంపికైన నలుగురు వ్యోమగాములను ప్రధాని మోదీ ఇప్పటికే యావత్‌ ప్రపంచానికి పరిచయం చేశారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌, అంగద్‌ ప్రతాప్‌, అజిత్ కృష్ణన్‌, వింగ్‌ కమాండర్‌ శుభాన్షు శుక్లాలను ఎంపిక చేశారు. గగన్‌యాన్‌ సక్సెస్ అయితే స్పేస్ రీసెర్చ్‌లో భారత్‌ మరో ట్రాక్ రికార్డు సొంతం చేసుకోనుంది. అంతరిక్ష పరిశోధనల్లోనూ మేడిన్ ఇండియాగా, ఆత్మనిర్భర్ భారత్‌గా మారనుంది.

ట్రెండింగ్ వార్తలు